Site icon NTV Telugu

Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

Yash Dayal’s Wife Shweta Pundir

Yash Dayal’s Wife Shweta Pundir

Who Is Yash Dayal’s Wife Shweta Pundir: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ యశ్ దయాల్ మరోసారి తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచాడు. వ్యక్తిగత జీవితంలోని వివాదాల మధ్య ఇటీవల అతడు సీక్రెట్‌గా వివాహం చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఫిబ్రవరి 4న నోయిడాలో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో శ్వేత పుండిర్‌ను యశ్ దయాల్ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు టీమిండియా, ఆర్సీబీ ప్లేయర్స్ ఎవరూ హాజరుకాకపోవడం గమనార్హం.

గత ఏడాది కాలంగా యశ్ దయాల్‌పై రెండు లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. యశ్ మాజీ ప్రేయసి ఓ కేసు నమోదు చేయగా, మరో కేసు ఒక మైనర్‌కు సంబంధించిన ఆరోపణలపై పోక్సో కింద నమోదైంది. ఈ కేసులో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. అయితే తర్వాత రాజస్థాన్ హైకోర్టు ఆ వారెంట్‌పై స్టే ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసులు విచారణలో ఉండగా.. యశ్ బెయిల్‌పై బయట ఉన్నాడు. వివాదాలు, న్యాయపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నప్పటికీ.. అతడు వివాహం చేసుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో అతడిని పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరా? అని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు.

శ్వేత పుండిర్ ఉత్తరాఖండ్‌కు చెందిన అమ్మాయి. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో నివసిస్తున్నారు. శ్వేత కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మాత్రమే కాదు.. బ్రాడ్‌కాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సుమారు 5.87 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా.. యూట్యూబ్‌లో 50 వేలకుపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అంతేకాకుండా ఇంటర్ కాంటినెంటల్ లెజెండ్స్ లీగ్‌లో బ్రాడ్‌కాస్టర్‌గా కూడా పని చేసిన అనుభవం ఆమెకు ఉంది. అయితే వీరిద్దరికి ఎపుడు, ఎలా పరిచయం అయిందనే విషయాలు ఇంకా తెలియరాలేదు.

Also Read: Potti Sriramulu Statue: నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం!

ఇక యశ్ దయాల్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో భాగంగా ఉన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో అతను ఆడే అవకాశముందని సమాచారం. వివాదాల మధ్య కూడా అతని క్రికెట్ కెరీర్ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి. ఐపీఎల్ 2025 టైటిల్ ఆర్సీబీ గెలవడంలో యశ్ దయాల్ కీలక పాత్ర పోషించారు. యశ్ దయాల్ 43 ఐపీఎల్ మ్యాచ్‌లలో 41 వికెట్స్ పడగొట్టాడు. అతడి బెస్ట్ బౌలింగ్ గణాంకాలు 3/20. ఐపీఎల్ 2025లో బెంగళూరు తరఫున 13 వికెట్స్ పడగొట్టాడు.

 

Exit mobile version