NTV Telugu Site icon

India : నెక్ట్స్ కెప్టెన్ అతడే..?: సునీల్ గవాస్కర్

Hardik Pandya

Hardik Pandya

భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ దిశగా టీమిండియా ముందుకు సాగుతుంది. 20 మంది ప్లేయర్లతో కూడిన ఓ ప్రత్యేకమైన కోర్ గ్రూప్ ను ఏర్పాటు చేసి వారితోనే మ్యాచ్ లను ఆడిస్తుంది. వరల్డ్ కప్ వరకూ టీమిండియాకు సారథిగా రోహిత్ శర్మనే ఉంటాడు. కానీ ఆ తర్వాత అతడు కొనసాగడం అనేది అనుమానమే. వయసు భారం, జట్టులోకి యువ ఆటగాళ్లు దూసుకొస్తుండటంతో ఇప్పటికే టీ20లలో సీనియర్లను పక్కనబెట్టిన టీమ్ మేనేజ్మెంట్.. వన్డే వరల్డ్ కప్ తర్వాత రోహిత్ తో కూడా మాట్లాడనుందని వార్తులు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ప్యూచర్ కెప్టెన్ ఎవరు..? అన్న రచ్చ కూడా జోరుగా సాగుతుంది. తాగాజా టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ దీనిపై రియాక్ట్ అయ్యారు. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ ఎవరు..? అన్న చర్చే వస్తే తాను మాత్రం హార్థిక్ పాండ్యాకే ఓటేస్తానన్నాడు.

Also Read : Ozone Hole: ఆస్ట్రేలియా కార్చిచ్చు కారణంగా పెరిగిన ఓజోన్ హోల్..

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిసింది.. ఈ నెల 17 నుంచి వన్డే సిరీస్ మొదలుకానున్న నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన టీవీ కార్యక్రమంలో గవాస్కర్ ఈ కామెంట్స్ చేశారు. కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా తన టీమ్ మెంబర్స్ తో చాలా కంఫర్ట్ గా ఉంటాడు అని తెలిపారు. అతడు ఆటగాళ్లను హ్యాండిల్ చేసే విధానం బాగుంటుంది.. ప్రతీ ఆటగాడి దగ్గరికి వెళ్లి వాళ్ల భుజానికి భుజం కలిపి మాట్లాడే విధానంతో వారికి ఎంతో ఓదార్పునిస్తుందని సునీల్ గవాస్కర్ అన్నారు. వాస్తవానికి మిడిలార్డర్ లో హార్దిక్ పాండ్యా చాలా ప్రభావం చూపగల ఆటగాడు.. అతడు ఒక గేమ్ ఛేంజర్.. తాను సారథిగా ఉన్న ఐపీఎల్ లో గుజరాత్ జెయింట్స్ తరపున ఆడుతూ అతడు బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చి ఆడాడు.. ఇది జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని గవాస్కర్ తెలిపారు.

Also Read : Goyaz Silver Jewellers: యాంకర్ సుమ చేతులమీదుగా గోయాజ్ జ్యూయలరీ ప్రారంభం

హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ నన్ను చాలా ఆకట్టుకున్నదని.. ముంబైలో ఆసీస్ తో జరుగబోయే మ్యాచ్ లో గనక గెలిస్తే ప్రపంచకప్ తర్వాత హార్థికే భారత జట్టు సారథిగా ఉంటాడని తాను నమ్ముతున్నా.. అని చెప్పాడు. కాగా ఆస్ట్రేలియాతో మార్చి 17న మొదలయ్యే తొలి వన్డేలో హార్థిక్ పాండ్యా సారథిగా ఉండనున్నాడు. వ్యక్తిగత కారణాలతో రోహిత్.. తొలి వన్డేకు దూరంగా ఉండనున్నాడు.. తర్వాత రెండు వన్డేలకు జట్టుతో కలుస్తాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు టీ20లలో సారథిగా వ్యవహరించిన పాండ్యా.. ఈ ఏడాది జనవరి నుంచి స్వదేశంలో దాదాపుగా పూర్తి స్థాయి సారథిగా ఎంపికయ్యాడు. ఇటీవల చేతన్ శర్మ స్టింగ్ ఆపరేసన్ వీడియోలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్ లలో అతడే కెప్టెన్ గా వ్యవహారించాడు. వన్డేలలో హార్థిక్ భారత్ కు సారథిగా వ్యవహరించడం ఇదే తొలిసారి..