Site icon NTV Telugu

IPL 2023: ముంబై ఇండియన్స్ అభిమానులకు షాక్.. ఐపీఎల్‌కు వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ గుడ్‌బై

Kieron Pollard

Kieron Pollard

IPL 2023: వచ్చే ఏడాది ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందే అభిమానులకు షాక్ తగిలింది. ఐపీఎల్‌కు వెస్టిండీస్ స్టార్ ఆల్‌‌రౌండర్ కీరన్ పొలార్డ్ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్‌లో 2010 నుంచి పొలార్డ్ ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడుతున్నాడు. ముంబై టీమ్‌లో మార్పులు అవసరమని.. తాను ఇప్పుడు ఆ జట్టుకు ఆడలేకపోతున్నానని పొలార్డ్ పోస్ట్ చేశాడు. అయితే తాను ఎప్పటికీ ముంబై ఇండియన్స్ జట్టుకు అండగానే ఉంటానని పొలార్డ్ తెలియజేశాడు. వచ్చే సీజన్ నుంచి ముంబై జట్టు బ్యాటింగ్ కోచ్‌గా పొలార్డ్ వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also: Elephant in Well: బావిలో పడ్డ ఏనుగు..ఎలా బయటకు తీశారంటే..?

కాగా వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్ కోసం వచ్చే నెలలో మినీ వేలం నిర్వహించనున్నారు. మినీ వేలానికి ముందు ప్రస్తుతం ఫ్రాంచైజీలన్నీ ఆటగాళ్లను షఫిల్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పొలార్డ్‌ను వదులుకోవాలని ముంబై నిర్ణయించుకుంది. ఈలోపే ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు పొలార్డ్ ప్రకటించాడు. ఐపీఎల్ కెరీర్‌లో పొలార్డ్ కేవలం ముంబై ఇండియన్స్‌కు మాత్రమే ఆడాడు. మొత్తం 171 ఇన్నింగ్స్‌లు ఆడిన పొలార్డ్ 3,412 పరుగులు చేశాడు. ఇందులో 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి బ్యాటింగ్ సగటు 28.67గా నమోదు కాగా స్ట్రైక్ రేట్ 147.32గా ఉంది. బౌలింగ్‌లో 69 వికెట్లు తీసిన పొలార్డ్ ఫీల్డింగ్‌లో 103 క్యాచ్‌లను అందుకున్నాడు. అయితే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్‌లో పొలార్డ్ దారుణంగా విఫలమయ్యాడు. 11 మ్యాచ్‌లు ఆడి 14.40 సగటుతో 144 పరుగులు మాత్రమే చేశాడు.

Exit mobile version