T20 World Cup: రెండు సార్లు ప్రపంచకప్ విజేత.. అయినా క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడాల్సిన దుస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: క్రికెట్ ప్రపంచంలో వెస్టిండీస్ జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ జట్టు నిండా హిట్టర్లే ఉంటారు. కానీ నిలకడలేమితో ఆ జట్టు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు దిగ్గజ జట్టుగా ప్రశంసలు పొందిన ఆ జట్టు నేడు ప్రపంచకప్‌లో పాల్గొనాలంటే క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు రెండు సార్లు టీ20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్ జట్టు సగర్వంగా అందుకుంది. 2012, 2016లో పొట్టి ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచింది. తొలిసారి టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమిండియాకు కూడా ఈ ఫీట్ సాధ్యం కాలేదు.
Read Also: ఈ స్టార్ హీరోయిన్ దొంగతనాలు చేసేదా? అబద్ధాలు చెప్పేదా?
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రపంచకప్‌లో క్వాలిఫైయర్ మ్యాచ్‌లను వెస్టిండీస్ జట్టు ఆడుతోంది. ఇందులో భాగంగా సోమవారం నాడు వెస్టిండీస్ జట్టు స్కాట్లాండ్‌తో తలపడబోతోంది. ఈ మ్యాచ్ హోబర్ట్ వేదికగా ఉదయం 9:30 గంటలకు మొదలవుతుంది. గ్రూప్ దశను దాటితేనే వెస్టిండీస్ జట్టు సూపర్ 12లోకి అడుగు పెట్టగలుగుతుంది. వెస్టిండీస్ జట్టుపై పెద్దగా అంచనాలు లేనప్పటికీ.. అద్భుతాలు జరగబోవనే గ్యారంటీ లేదు. క్రికెట్‌లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. విండీస్ బ్యాటింగ్ గాడిన పడితే ఆ జట్టును ఆపడం ఎవరి తరం కాదు. ముఖ్యంగా 2016 ప్రపంచకప్ ఫైనల్‌లో చివరి ఓవర్‌లో వరుసగా సిక్సర్లు బాది ఇంగ్లండ్‌కు పరాభవాన్ని మిగిల్చింది. నికోలస్ పూరన్ నాయకత్వంలో ఆడుతున్న విండీస్ జట్టు ఈ ప్రపంచకప్‌లో ఎక్కడి వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!