Site icon NTV Telugu

Pakistan vs West Indies: పాక్ను చిత్తుగా ఓడించిన వెస్టిండీస్.. 35 ఏళ్ల తర్వాత సిరీస్ కైవసం!

Wi

Wi

Pakistan vs West Indies: వెస్టిండీస్ జట్టు రికార్డు సృష్టించింది. వన్డే సిరీస్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించి 34 ఏళ్ల పగను తీర్చుకుంది. 1991 తర్వాత పాక్ పై వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రస్తుతం దాయాది జట్టు వెస్టిండీస్ టూర్ లో ఉంది. 3 వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ తరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో జరగ్గా.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్, నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 రన్స్ చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన పాక్ జట్టు పూర్తిగా కుప్పకూలింది. కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సల్మాన్ ఆఘా 30 రన్స్ తో టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు.

Read Also: Team india Cricketers: మీరు హద్దు దాటొద్దు.. ప్రమాదం తెచ్చుకోవద్దు!

అయితే, ఒక దశలో 8 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్, ఏకంగా ఐదుగురు బ్యాటర్లు సున్నా పరుగులకే ఔట్ అయ్యారు. ఓపెనర్లు సయీమ్ అయూబ్ (0), అబ్దుల్లా షఫిక్ (0), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (0), హసన్ అలీ (0), అబ్రార్ అహ్మద్ (0 – రనౌట్) అవుట్ అవ్వగా.. బాబర్ ఆజమ్ (9), హసన్ రజా (13), హుస్సేన్ తలత్ (1), మహ్మద్ నవాజ్ (23), నసీమ్ షా (6) విఫలమయ్యారు. ఇక, వెస్టిండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ విరుచుకుపడటంతో.. 7.2 ఓవర్లలో 34 రన్స్ ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. గుడకేష్ మోతీ 2, రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ తీసుకున్నారు. కాగా, బ్యాటింగ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 120 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. జస్టిన్ గ్రీవ్స్ 43 రన్స్ చేసి జట్టు భారీ స్కోర్ సాధించడంతో కీ రోల్ పోషించాడు. ఈ గెలుపుతో పాకిస్తాన్‌పై 34 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ ను గెలిచి చరిత్రలో తన పేరును వెస్టిండీస్ లఖించుకుంది.

Exit mobile version