Site icon NTV Telugu

దక్షిణాఫ్రికాపై సిరీస్ గెలవాలంటే ఈ వ్యూహం అనుసరించాలి: జాఫర్

టీమిండియాకు దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. సచిన్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్, ధోనీ వంటి దిగ్గజాల నేతృత్వంలో కూడా భారత్ టెస్ట్ సిరీస్ సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు టీమిండియాను సువర్ణావకాశం ఊరిస్తోంది. ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటే ఈసారి సిరీస్ సాధించొచ్చని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా ఆడిన మూడు టెస్టుల్లో ఒక్కసారి మాత్రమే 250 ప్లస్ స్కోరు చేసిందని.. అందుకే ఆ సిరీస్ భారత్ గెలవలేదని జాఫర్ అన్నాడు.

Read Also: అంతర్జాతీయ క్రికెట్‌కు హర్భజన్‌సింగ్‌ గుడ్‌బై

అయితే అప్పుడు భారత్ ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని అనుసరించి బొక్కాబోర్లా పడిందన్నాడు జాఫర్. ఇప్పుడు మాత్రం ఏడుగురు బ్యాటర్లతో టీమిండియా బరిలోకి దిగాలని అతడు సూచించాడు. బుమ్రా, షమీ, సిరాజ్, అశ్విన్‌లు బౌలింగ్ భారాన్ని మోయగలరని… అదనపు బ్యాటర్‌గా ఆల్‌రౌండర్ లేదా పూర్తిస్థాయి బ్యాట్స్‌మన్‌ను తీసుకోవాలని కెప్టెన్ కోహ్లీకి హితవు పలికాడు. కాగా త్వరలో ఆదివారం నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.

Exit mobile version