Site icon NTV Telugu

Wasim Akram: రాసి పెట్టుకోండి.. భారత్ నెక్ట్స్ కెప్టెన్ అతడే

Wasim Akram On Pandya

Wasim Akram On Pandya

Wasim Akran Says Hardik Pandya Will Become Next Captain of India: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌పై భారత్ సాధించిన విజయంలో.. హార్దిక్ పాండ్యా కూడా కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో (3 వికెట్లు) అదరగొట్టడమే కాకుండా, బ్యాటింగ్‌లో (40 పరుగులు) విరాట్ కోహ్లీకి సహాయం అందించి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలోనే అతనిపై సర్వత్రా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. పాక్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ అయితే.. భారత్ తదుపరి కెప్టెన్ పాండ్యానే అవుతానంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.

‘‘ముందుగా పాండ్యా ఐపీఎల్‌ జట్టుకు కెప్టెన్‌ అయ్యాడు. ఆ జట్టుని ముందుండి నడిపించడమే కాకుండా, ట్రోఫీ గెలిచాడు. ఇప్పుడు జట్టులో పాండ్యా కీలక సభ్యుడు మాత్రమే కాదు.. కెప్టెన్‌కు సలహాలు ఇవ్వగల స్థాయిలో ఉన్నాడు. జయాపజయాలపై అతని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. భవిష్యత్తులో పాండ్యా టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అంటూ వసీమ్ అక్రమ్ చెప్పుకొచ్చాడు. అలాగే మరో మాజీ పాక్ క్రికెటర్ వకార్ యూనిస్ కూడా పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపించాడు. కఠిన పరిస్థితులను ఎదుర్కొని, పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చిన విధానాన్ని స్ఫూర్తిదాయకం అని కొనియాడాడు.

‘‘ఐపీఎల్‌-2022 సందర్భంగా.. పాండ్యా తొలిసారిగా కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. జట్టును విజయవంతంగా ముందుకు నడిపించడంతో పాటు టైటిల్ గెలిచాడు. గడ్డు పరిస్థితుల నుంచి బయటపడి.. ఒత్తిడిని అతడు అధిగమించిన తీరు అమోఘం. అలాగే.. ఫినిషర్‌గా బాధ్యతను నెరవేర్చిన తీరు సైతం అద్భుతం. మానసికంగా దృఢంగా ఉండి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఎలాంటి ఫలితాలు వస్తాయో పాండ్యా నిరూపించాడు’’ అంటూ వకాస్ యూనిస్ పొగడ్తలతో ముంచెత్తాడు.

Exit mobile version