IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Washington Sundar Out: శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు వరుస గాయాలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ బ్యాటర్ సాయి సుదర్శన్ గాయాల కారణంగా సిరీస్‌కు దూరమయ్యారు. తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశాలు లేవని సమాచారం. దీంతో భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగలనుంది.
శ్రీలంకతో జరగనున్న రెండో టెస్టు కోసం వాషింగ్టన్ సుందర్‌ను అదనపు ఆటగాడిగా బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ప్రస్తుతం అతడు హ్యామ్‌స్ట్రింగ్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో కొలంబోలో జరిగే రెండో టెస్టుకు అతడు జట్టుతో కలిసే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఒకవేళ పూర్తిగా కోలుకున్నా.. గాయం తర్వాత ఎక్కువగా క్రికెట్ ఆడకపోవడంతో వెంటనే టెస్ట్ మ్యాచ్‌లో ఆడించే సాహసం టీమ్ మేనేజ్మెంట్ చేయదు.
Also Read
- Hardik Pandya: "కెప్టెన్సీ ఇస్తేనే వస్తా".. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
- IND vs AFG Schedule: భారత్, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదే.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్?
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్‌కి కూడా సాధ్యం కాలేదు..
- Rocky Flintoff: తండ్రిని మించిన కొడుకు.. 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ విధ్వంసం.. తండ్రి రికార్డులే టార్గెట్!
ఇంగ్లండ్ సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. అప్పటి నుంచి అతడి వర్క్‌లోడ్‌ను వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. గాయం నుంచి కోలుకున్న వెంటనే మళ్లీ ఆటగాళ్లు గాయపడిన సందర్భాలు ఉండటంతో.. సుందర్ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని బీసీసీఐ మెడికల్ టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. సుందర్‌ను రెండో టెస్టు కోసం ఎంపిక చేసినప్పటికీ అతడు పూర్తి ఫిట్నెస్ సాధించడం అనేది ఇప్పటికీ సందేహంగానే ఉంది. ఫిట్‌నెస్‌పై వచ్చే వారం మరోసారి పూర్తి స్థాయిలో అంచనా వేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ సుందర్ శ్రీలంకకు వెళ్లలేకపోతే.. అతడి స్థానంలో కొత్త ఆటగాడిని బీసీసీఐ ప్రకటించాల్సి ఉంటుంది.
ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం కారణంగా శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. మరోవైపు సాయి సుదర్శన్ కూడా కాలికి గాయం కావడంతో జట్టుకు అందుబాటులో లేడు. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ కూడా దూరమైతే.. సిరీస్‌కు ముందు టీమిండియాకు ఇది ఎదురుదెబ్బ అవుతుంది. గాయాలతో ఇబ్బంది పడుతున్న బుమ్రా, ఆకాశ్ దీప్ ప్రస్తుతం రిహాబిలిటేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇద్దరి పునరాగమనానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ లేదు. వరుసగా కీలక ఆటగాళ్లు గాయపడుతుండటంతో శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు భారత జట్టు మేనేజ్మెంట్పై ఒత్తిడి పెరుగుతోంది.
తాజావార్తలు
-
IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
ట్రెండింగ్
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!