Site icon NTV Telugu

Virat Kohli: ఇక కోహ్లీని ఎవరూ ఆపలేరు.. 2027 ప్రపంచకప్ జట్టు నుంచి గంభీర్ ఎలా తప్పించగలడు?

Virat Kohli

Virat Kohli

భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. వరుసగా రెండు సెంచరీలతో విమర్శకుల నోళ్లు మూయించాడు. రాంచీ వన్డేలో 120 బంతుల్లో 153 రన్స్ చేసిన కింగ్.. రాయపూర్ వన్డేలో 93 బంతుల్లో 102 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్‌లో విరాట్ వరుసగా సెంచరీలు చేయడం ఇది 11వ సారి. తనను ‘కింగ్’ అని ఎందుకు పిలుస్తారో కోహ్లీ మరోసారి నిరూపించాడు. ఇక వన్డే ప్రపంచకప్ 2027లో ఆడకుండా అతడిని ఎవరూ ఆపలేరు.

2027 వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఆడించకూడదని భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అనుకుంటున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ విరాట్, రోహిత్ బ్యాటింగ్ తీరు చూస్తే.. వారిని జట్టు నుంచి పక్కన పెట్టడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. 2027 ప్రపంచకప్‌ సమయానికి రో-కోలకు దాదాపు 39 ఏళ్లు ఉంటాయి. అందుకే వారి భవిష్యత్తు గురించి నిరంతరం చర్చ జరుగుతోంది. కానీ ఇద్దరూ హాఫ్ సెంచరీఎం సెంచరీలతో చెలరేగుతూ.. జట్టుకు తాము ఎంత ముఖ్యమో నిరూపిస్తున్నారు. ఇద్దరూ టీ20, టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. విరాట్‌తో పాటు రోహిత్ కూడా గత మూడు మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీతో అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించాడు.

ఆధునిక యుగంలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ వన్డే బ్యాట్స్‌మన్. రాంచీలో 120 బంతుల్లో 11 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 135 పరుగులు చేశాడు. రాయ్‌పూర్‌లో 93 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ తన చివరి నాలుగు వన్డేల్లో 73, 121 నాటౌట్, 57, 14 పరుగులు చేశాడు. ఇద్దరికీ మొత్తం నాలుగు వన్డే ప్రపంచకప్‌లలో ఆడిన అనుభవం ఉంది. రోహిత్ 2015, 2019, 2023 ప్రపంచ కప్‌లలో ఆడాడు. విరాట్ 2011, 2015, 2019, 2023 వన్డే ప్రపంచకప్ జట్టులో ఉన్నాడు.

25 ఏళ్ల తర్వాత తొలిసారిగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ 0-2 తేడాతో ఓటమి పాలైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ భారత క్రికెట్‌లో పరివర్తన ప్రక్రియను వేగవంతం చేశాయి. ఐతే భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రయోగాలు విఫలమవుతున్నాయి. జట్టులో కుర్రాళ్లు ఒత్తిడిని తట్టుకోలేక చిత్తవుతున్నారు. దాంతో ఈ ఇద్దరిపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తన్నాయి. ప్రస్తుత భారత జట్టులోనే కాకుండా ప్రత్యర్థి జట్టులో కూడా రోహిత్, విరాట్ అంత ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌ లేరు. 2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే భారత జట్టులో ఇద్దరు దిగ్గజాలు ఉండాల్సిందే అని అటు మాజీలు, ఇటు ఫాన్స్ అంటున్నారు. ఇలానే ఆడితే రో-కోలను ప్రపంచకప్ జట్టు నుంచి తప్పిందం గంభీరే కాదు.. ఆ దేవుడి వాళ్ళ కూడా కాదు.

Exit mobile version