Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు నమోదైంది. ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆసియా కప్ చరిత్రలో వన్డే ఫార్మాట్, టీ20 ఫార్మాట్లలో సున్నా పరుగులకే అవుటైన తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో నాలుగు బంతులు ఆడిన కోహ్లీ మధుశంక బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. గత రెండు మ్యాచ్‌లలో కోహ్లీ హాఫ్ సెంచరీలు చేసి ఊపు మీద ఉండగా ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోరు చేస్తాడని అభిమానులు ఊహించారు. కానీ అందరి ఆశలను తలకిందులు చేస్తూ పరుగులేమీ చేయకుండానే వెనుతిరిగాడు.
Read Also: IND Vs SL: కెప్టెన్ రోహిత్ శర్మ ఒంటరి పోరు.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?
కాగా వన్డే, టీ20 ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీకి అద్భుత రికార్డులు ఉన్నాయి. ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో (2010, 2012, 2014) మొత్తం 11 మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు సహా 613 పరుగులు చేశాడు. ఆసియా కప్ ప్రారంభ టీ20 ఎడిషన్‌లో కోహ్లీ 76.60 సగటుతో ఐదు మ్యాచ్‌లలో 153 పరుగులతో టీమిండియా టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆసియా కప్‌లో టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు శ్రీలంకపై విరాట్ కోహ్లీ 154 పరుగులు చేశాడు. కాగా ప్రస్తుత ఆసియాకప్‌లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.