Site icon NTV Telugu

Virat Kohli-SRH: ఎస్‌ఆర్‌హెచ్‌ అంటేనే ఊగిపోతున్న విరాట్ కోహ్లీ.. చివరి 5 ఇన్నింగ్స్‌లో పరుగుల వరదే!

Virat Kohli vs SRH Stats

Virat Kohli vs SRH Stats

RCB Star Virat Kohli Stats vs SRH: టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను నిరూపించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఓపెనర్ కోహ్లీ 38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. కింగ్ జట్టుకు బలమైన ఆరంభం ఇవ్వడమే కాకూండా.. సూపర్ ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌పై తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు.

గత కొన్ని మ్యాచ్‌లుగా విరాట్ కోహ్లీ ఎస్‌ఆర్‌హెచ్‌పై పరుగుల వరద పారిస్తున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ అంటేనే కింగ్ ఊగిపోతున్నాడు. చివరి ఐదు ఇన్నింగ్స్ స్కోర్లు చూస్తే ఇది స్పష్టమవుతోంది. 63 బంతుల్లో సెంచరీ, 20 బంతుల్లో 42, 43 బంతుల్లో 51, 25 బంతుల్లో 43 రన్స్ చేసిన కోహ్లీ.. తాజా మ్యాచ్‌లో 38 బంతుల్లో 69 రన్స్ బాదాడు. ఎస్‌ఆర్‌హెచ్‌పై ప్రతి మ్యాచ్‌లోనూ కోహ్లీ తన స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.

ఈ గణాంకాలు చూస్తే ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లపై విరాట్ కోహ్లీ ఎంతటి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడో ఇట్టే అర్థమవుతోంది. భారీ షాట్లు, క్లాసిక్ కవర్ డ్రైవ్స్, రన్ రేట్‌ను నియంత్రించే నైపుణ్యం.. అన్ని కలిపి కోహ్లీని ఈ మ్యాచ్‌ల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ముఖ్యంగా చేజింగ్‌లో కోహ్లీ చూపిస్తున్న స్థిరత్వం జట్టుకు పెద్ద బలంగా మారుతోంది. అతని అనుభవం, క్లాస్ ఆర్‌సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎస్‌ఆర్‌హెచ్‌పై కోహ్లీ ఫామ్ చూస్తుంటే.. కింగ్ ఇంకొన్నేళ్లు టాప్ లెవెల్‌లో రాణిస్తాడనే నమ్మకం మరింత పెరిగింది. మరి ఐపీఎల్ 2026లో విరాట్ ఎన్ని రన్స్ చేస్తాడో చూడాలి.

 

Exit mobile version