Virat Kohli-SRH: ఎస్‌ఆర్‌హెచ్ అంటేనే ఊగిపోతున్న విరాట్ కోహ్లీ.. చివరి 5 ఇన్నింగ్స్‌లలో పరుగుల వరదే!
- ఎస్‌ఆర్‌హెచ్ అంటేనే ఊగిపోతున్న విరాట్ కోహ్లీ
- చివరి 5 ఇన్నింగ్స్‌లో పరుగుల వరదే
- 2026లో విరాట్ ఎన్ని రన్స్ చేస్తాడో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB Star Virat Kohli Stats vs SRH: టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను నిరూపించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఓపెనర్ కోహ్లీ 38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. కింగ్ జట్టుకు బలమైన ఆరంభం ఇవ్వడమే కాకూండా.. సూపర్ ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌పై తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు.
గత కొన్ని మ్యాచ్‌లుగా విరాట్ కోహ్లీ ఎస్‌ఆర్‌హెచ్‌పై పరుగుల వరద పారిస్తున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్ అంటేనే కింగ్ ఊగిపోతున్నాడు. చివరి ఐదు ఇన్నింగ్స్ స్కోర్లు చూస్తే ఇది స్పష్టమవుతోంది. 63 బంతుల్లో సెంచరీ, 20 బంతుల్లో 42, 43 బంతుల్లో 51, 25 బంతుల్లో 43 రన్స్ చేసిన కోహ్లీ.. తాజా మ్యాచ్‌లో 38 బంతుల్లో 69 రన్స్ బాదాడు. ఎస్‌ఆర్‌హెచ్‌పై ప్రతి మ్యాచ్‌లోనూ కోహ్లీ తన స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.
Also Read
- Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
- Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
- US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
ఈ గణాంకాలు చూస్తే ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లపై విరాట్ కోహ్లీ ఎంతటి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడో ఇట్టే అర్థమవుతోంది. భారీ షాట్లు, క్లాసిక్ కవర్ డ్రైవ్స్, రన్ రేట్‌ను నియంత్రించే నైపుణ్యం.. అన్ని కలిపి కోహ్లీని ఈ మ్యాచ్‌ల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ముఖ్యంగా చేజింగ్‌లో కోహ్లీ చూపిస్తున్న స్థిరత్వం జట్టుకు పెద్ద బలంగా మారుతోంది. అతని అనుభవం, క్లాస్ ఆర్‌సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎస్‌ఆర్‌హెచ్‌పై కోహ్లీ ఫామ్ చూస్తుంటే.. కింగ్ ఇంకొన్నేళ్లు టాప్ లెవెల్‌లో రాణిస్తాడనే నమ్మకం మరింత పెరిగింది. మరి ఐపీఎల్ 2026లో విరాట్ ఎన్ని రన్స్ చేస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!