Virat Kohli Talks About His Captaincy: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఎన్నో విజయాలను, మరెన్నో ఘనతలను సాధించింది. కానీ.. ప్రధాన ఈవెంట్లలోనే పరాభావాలు చవిచూసింది. సెమీస్ లేదా ఫైనల్స్ దాకా వెళ్లి.. ట్రోఫీ నెగ్గకుండా ఇంటికి తిరిగొచ్చేసింది. దాంతో.. కోహ్లీపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. కెప్టెన్‌గా కోహ్లీ తగిన వాడు కాదని, ప్రధాన ట్రోఫీలు నెగ్గిందే లేదంటూ కామెంట్లు వచ్చాయి. కోహ్లీ ఒక ఫెయిల్యూర్ కెప్టెన్ అని ముద్ర వేశారు. అతడ్ని కెప్టెన్‌గా తొలగించి, మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కోహ్లీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు లాక్కొని, రోహిత్ శర్మకు అప్పగించారు. ఈ వ్యవహారంపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న కోహ్లీ, ఇప్పుడు ఎట్టకేలకు పెదవి విప్పాడు. తానెప్పుడూ ఫెయిల్యూర్ కెప్టెన్ కాదని డిఫెండ్ బదులిచ్చాడు.
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో తుపాకుల మోత.. ముగ్గురు జవాన్లు మృతి
ఆర్సీబీ పోస్ట్‌కాడ్‌లో కోహ్లీ మాట్లాడుతూ.. ‘‘నేనెప్పటికీ ఫెయిల్యూర్ కెప్టెన్‌ని కాను. నా కెప్టెన్సీలో టీమిండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కి అర్హత సాధించింది. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో అడుగుపెట్టడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడింది. అయినా సరే.. నన్ను ఫెయిల్యూర్ కెప్టెన్‌గానే చూశారు’’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో తనకు, ధోనీకి మధ్య ఉన్న అనుబంధం గురించి కోహ్లీ మాట్లాడాడు. తానెప్పటికీ ధోనీకి రైట్ హ్యాండ్ అని.. ధోనికి, తనకు మధ్య నమ్మకం, క్లారిటీ ఎక్కువ అని చెప్పాడు. అందుకే.. ఏ విషయమైనా అతనితో పంచుకుంటానన్నాడు. ధోనీ తనకు ఎప్పుడూ అండగా ఉంటాడని.. టెస్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పినప్పుడు ధోనీ మాత్రమే తనకు మెసేజ్ పంపాడని గుర్తు చేశాడు. ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్తూ.. తనలో ఆత్మస్థైర్యం పెంచుతాడని పేర్కొన్నాడు.
Asaduddin Owaisi : పేర్లు మార్చినంత మాత్రాన నీళ్లు వస్తాయా? ఉపాధి లభిస్తుందా?