Site icon NTV Telugu

Virat Kohli Inspired a generation: కోహ్లీపై సచిన్ ట్వీట్ వైరల్

విరాట్ కోహ్లీ వందవ టెస్ట్ పై ఎన్నో అంచనాలున్నాయి. దీనిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. శుక్రవారం నుంచి మొహాలీలో భారత్-శ్రీలంక తలపడనున్నాయి. తన 100వ టెస్టు ఆడబోతున్న విరాట్ కోహ్లీకి సచిన్ టెండూల్కర్ శుభాకాంక్షలు అందించాడు. కోహ్లి యొక్క “అద్భుతమైన” ఆన్-ఫీల్డ్ అచీవ్‌మెంట్ కాకుండా, అతని నిజమైన విజయం మొత్తం తరం క్రికెటర్లను ప్రేరేపించగల సామర్థ్యం అని సచిన్ నొక్కిచెప్పారు.

రెండేళ్లకు పైగా ఏ ఫార్మాట్లోనూ సెంచరీ చేయలేదు. ఇప్పుడు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్ గా లేడు. బ్యాటింగ్‌లో అంత ఊపులేదు. ఆటలో ఆత్మవిశ్వాసం, మైదానంలో ఉత్సాహం అంతగా లేవంటున్నారు. ఎంతటి ఆటగాడికైనా కెరీర్లో ఒడుదొడుకులు మామూలే. అందుకు విరాట్‌ ఎలాంటి మినహాయింపు లేదు. డు విరాట్‌ కోహ్లి వందవ మ్యాచ్ పై అంచనాలు తక్కువేం కాదు. సగం మ్యాచ్‌లు ఆడేసరికే దిగ్గజ ఆటగాళ్ల జాబితాలోకి చేరిపోయాడు! మామూలుగా అయితే వంద టెస్టుల మైలురాయిని అందుకోవడం విరాట్‌కు ఒక లాంఛనం. కానీ రెండేళ్లుగా తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నాడు.

https://ntvtelugu.com/bcci-new-contracts-for-cricketers/

కెప్టెన్సీకి కూడా దూరమైన సమయంలో వందో టెస్టు ఆడుతుండటంతో ఈ మ్యాచ్‌పై అందరి దృష్టి పడింది. మొహాలిలో విరాట్‌ తన మార్కు ఆట ఆడి, శతక టెస్టును చిరస్మరణీయం చేసుకుంటాడా? అంతకుమించి ఆట తీరుతో తనపై వస్తున్న విమర్శలకు ధీటుగా బదులిస్తాడా అనేది శుక్రవారం తేలిపోనుంది. 2014లో తొలిసారి ఇంగ్లాండ్‌లో పర్యటించినపుడు అండర్సన్‌ బృందం స్వింగ్‌ బంతుల్ని ఎదుర్కోలేక విరాట్‌ అనేక అవస్థలు పడ్డాడు. అయిదు టెస్టుల్లో కలిపి 10 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 13.4 సగటుతో 134 పరుగులు మాత్రమే చేశాడు. ఎన్నో విమర్శలు విరాట్ పై ముల్లులా గుచ్చుకున్నాయి.ఆ తర్వాత ఎన్నో మైలురాళ్ళు సాధించాడు. తన నుంచి తనే ప్రేరణ పొంది ఒకప్పటి విరాట్‌ అభిమానుల ముందుకొస్తాడేమో చూడాలి. కాగా, అంతర్జాతీయ క్రికెట్లో 100 టెస్టుల మైలురాయి చేరుకున్న 71వ ఆటగాడిగా కోహ్లి నిలవనున్నాడు. 11 మంది భారత ఆటగాళ్లు ఇప్పటికే ఈ ఘనత అందుకున్నారు. 100వ టెస్ట్ ఎన్ని రికార్డులకు వేదిక అవుతుందో చూడాలి.

Exit mobile version