NTV Telugu Site icon

IND vs AFG: మూడేళ్ల తర్వాత సెంచరీ బాదిన కోహ్లీ.. కింగ్‌ ఈజ్ బ్యాక్ అంటున్న అభిమానులు

Virat Kohli

Virat Kohli

IND vs AFG: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ కోసం ఎదురుచూసిన అభిమానుల ఆశలు నెరవేరాయి. ఎట్టకేలకు మూడేళ్ల అనంతరం.. దాదాపు వెయ్యి రోజుల తర్వాత కోహ్లీ సెంచరీ కొట్టాడు. ఆసియా కప్‌లో గురువారం అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన కోహ్లి.. 53 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్‌గా 61 బంతుల్లో 122 పరుగులు చేసిన కోహ్లీ తన టీ-20 కెరీర్‌లో అత్యధిక పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీంతో నెట్టింట కోహ్లీ అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

టీ20ల్లో రోహిత్‌ శర్మ రికార్డును విరాట్‌ కోహ్లీ బ్రేక్‌ చేశాడు. ఇప్పటి వరకు 119 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా రోహిత్ ఉండగా… ఆఫ్ఘన్‌పై 122 పరుగుల చేసి విరాట్ రోహిత్‌ను వెనక్కి నెట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో తన ఆటతో కోహ్లీ హైలెట్‌గా నిలిచాడు. మైదానంలో అన్ని వైపులకు బంతిని పరుగులు తీయించిన కోహ్లీ ఓవరాల్ గా 71వ అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలో అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ, ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ (71)తో కలిసి సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు. అంతేకాదు, అంతర్జాతీయ టీ20 పోటీల్లో కోహ్లీకిదే తొలి సెంచరీ. దాంతోపాటే, భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్ మన్‌గానూ అవతరించాడు.

Asia Cup 2022: ఆసియా కప్ జట్టులో అవేశ్ ఖాన్ స్థానంలో దీపక్ చాహర్‌

విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ తర్వాత టీమ్ ఇండియా తమ బ్యాటింగ్ ప్రస్థానాన్ని 212/2 వద్ద ముగించింది. కోహ్లీ 61 బంతుల్లో 122 పరుగులు చేయగా, పంత్ 16 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు 20.0 ఓవర్లలో 213 పరుగులు చేయాలి. అంతకుముందు, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం జరిగిన ఆసియా కప్ సూపర్ 4 చివరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నేటి మ్యాచ్‌లో రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి, కేఎల్ రాహుల్ టీమ్ ఇండియాకు నాయకత్వం వహిస్తున్నాడు.

Show comments