Site icon NTV Telugu

Team India: దివ్యాంగ అభిమానికి కోహ్లీ గిఫ్ట్.. వీడియో వైరల్

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల తన కెరీర్‌లో 100వ టెస్టు ఆడాడు. ఈ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం స్టేడియం నుంచి హోటల్‌కు వెళ్తుండగా కోహ్లీ తన అభిమానికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. బస్సు ఎక్కుతున్న సమయంలో తన కోసం వేచి చూస్తున్న ఓ దివ్యాంగ అభిమానిని చూసి కోహ్లీ చలించిపోయాడు.

ఈ నేపథ్యంలో తన అభిమాని ధ‌ర‌మ్‌వీర్ పాల్‌కు విరాట్ కోహ్లీ త‌న జెర్సీని బ‌హుమ‌తిగా ఇచ్చేశాడు. ఈ విషయాన్ని ధరమ్ వీర్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. కోహ్లీ 100వ టెస్టు సందర్భంగా అతడి జెర్సీని తనకు బహుమతిగా ఇచ్చాడని పోస్ట్ చేశాడు. దీంతో విరాట్ కోహ్లీపై సోష‌ల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. కోహ్లీ బహుమతి ఇస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా శ్రీలంక‌తో జ‌రిగిన తొలి టెస్టులో కోహ్లీ 45 పరుగులు చేసిన విష‌యం తెలిసిందే.

Exit mobile version