Site icon NTV Telugu

Virat Kohli: ధోనీ పుట్టినరోజుపై భావోద్వేగ ట్వీట్

Kohli Emotional Tweet On Ko

Kohli Emotional Tweet On Ko

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఈరోజు 41వ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో అభిమానులు సహచర ఆటగాళ్లు విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. ‘‘నీలాంటి నాయకుడు ఇంకెవరూ ఉండరు. భారత జట్టుకి నువ్వు అందించిన ఎనలేని సేవలకు ధన్యవాదాలు. నువ్వు నాకు పెద్దన్నలా మారావు. నీ పట్ల నాకున్న ప్రేమ, గౌరవం ఎప్పుడూ అలాగే ఉంటాయి. హ్యాపీ బర్త్‌డే కెప్టెన్’’ అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు. అలాగే అతనితో కలిసి దిగిన ఫోటోలనూ షేర్ చేశాడు. మనసుల్ని కదిలించేలా కోహ్లీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

కోహ్లీతో పాటు హర్భజన్, సురేశ్ రైనా, సూర్యకుమార్ యాదవ్‌లతో పాటు మరెందరో ధోనీకి విషెస్ తెలిపారు. కోహ్లీ తరహాలోనే రైనా కూడా ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ‘‘నా బిగ్ బ్రదర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా జీవితంలోని ప్రతి దశలోనూ నువ్వు పెద్ద సపోర్టర్‌గానూ, మెంటోర్‌గానూ నిలిచావు. నువ్వు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. నీ పట్ల నా ప్రేమ ఎప్పుడూ ఉంటుంది’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇలా ప్రతిఒక్కరూ ధోనీకి విషెస్ తెలుపుతున్న నేపథ్యంలో #HappyBirthdayDhoni హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. కాగా.. ధోని తన కెరీర్‌లో 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు, 2011 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌, 2013 చాంపియ‌న్స్ ట్రోఫీలు సాధించి.. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు తెచ్చిపెట్టాడు. ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రపుటలకెక్కాడు.

Exit mobile version