NTV Telugu Site icon

Virat Kohli: కోహ్లీ అరుదైన ఘనత.. రెండో భారత క్రికెటర్‌గా..

Virat Kohli Record

Virat Kohli Record

Virat Kohli Creates Rare Record In International Cricket: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 300 క్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. దీంతో.. అంతర్జాతీయ క్రికెట్‌లో 300 క్యాచ్‌లను అందుకున్న రెండో భారత క్రికెటర్‌గా కోహ్లీ రికార్డ్ నెలకొల్పాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో నాథన్ లియోన్ క్యాచ్ పట్టడంతో.. కోహ్లీ ఈ రికార్డ్‌ని నెలకొల్పాడు. 334 క్యాచ్‌లతో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్‌లో చూసుకుంటే.. శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేళ జయవర్దనే 440 క్యాచ్‌లతో మొదటి స్థానంలో ఉన్నాడు. అతని తర్వాత రికీ పాంటింగ్(364), రాస్ టేల్(351), జాక్వస్ కల్లీస్(338) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. కేవలం టెస్టు క్రికెట్ విషయానికొస్తే.. విరాట్ కోహ్లీ 109 క్యాచ్‌లను పట్టుకున్నాడు. తద్వారా.. భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్(108)ను కోహ్లి అధిగమించాడు.

Father Gets Daughter Pregnant: కూతురిని గర్భవతిని చేసిన తండ్రి.. కోర్టు సంచలన శిక్ష

ఇక ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ జట్టు 480 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బ్యాటర్లు ఉస్మాన్‌ ఖ్వాజా(180), గ్రీన్‌(114) సెంచరీలతో చెలరేగడంతో.. ఆస్ట్రేలియా జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. భారత బౌలర్ల విషయానికొస్తే.. 6 వికెట్లతో అశ్విన్ తన సత్తా చాటాడు. ఈ క్రమంలోనే అశ్విన్ రెండు రికార్డులను తన ఖాతాలో లిఖించుకున్నాడు. స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక (26 సార్లు) ఐదు వికెట్స్ హాల్స్ నమోదు చేసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అలాగే.. ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఇక షమీ రెండు వికెట్లు, అక్షర్‌ & జడేజా చెరో వికెట్ సాధించారు. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న భారత్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 36 పరుగులు చేసింది.

Virat KohlNTR30: NTR30 నుంచి డబుల్ ధమాకా.. అదొక్కటే ఆలస్యం

Show comments