ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఆఖరి టెస్ట్ కరోనా కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. 4వ టెస్ట్ సమయంలో భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా బారిన పడ్డారు. అనంతరం టీం ఇండియా సహాయక సిబ్బందిలో కూడా కరోనా కేసులు నమోదుకావడంతో 5 వ టెస్ట్ మ్యాచ్ ను రద్దు చేసారు. దాంతో భారత ఆటగాళ్లు అందరూ యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2021 సెకండ్ హాఫ్ లో పాల్గొనేందుకు వచ్చేసారు. కెప్టెన్ కోహ్లీ కూడా తన బెంగళూరు జట్టుతో కలిసాడు. కానీ అక్కడి నియమాల ప్రకారం ప్రస్తుతం ఆరు రోజుల క్వారంటైన్ లో ఉన్నాడు. ఆ సమయంలో ఆర్సీబీ బోల్డ్ లో కోహ్లీ ఆఖరి టెస్ట్ రద్దు పై మాట్లాడుతూ.. కరోనా కారణంగా చివరి టెస్ట్ ఆగిపోవడం దురదృష్టకరం అని చెప్పాడు. అలాగే కనీసం ఇక్కడ యూఏఈ లోనైనా బలమైన బయోబాబుల్ సురక్షితమైన వాతావరణం ఉంటుంది అనుకుంటున్నాను అని తెలిపాడు కోహ్లీ.
టెస్ట్ రద్దవ్వడం పై స్పందించిన కోహ్లీ…
