Site icon NTV Telugu

సచిన్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

టీమిండియా రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడి నిలిచాడు. మూడు వన్డేల సిరీస్‌లో బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 9 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద విరాట్ ఈ రికార్డు అందుకున్నాడు. దాంతో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బద్దలు కొట్టాడు. విదేశాల్లో సచిన్ వన్డేల్లో 5,065 పరుగులు చేయగా… విరాట్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు.

Read Also: టీమిండియా కెప్టెన్ సహా ఐదుగురు ఆటగాళ్లకు కరోనా

విదేశాల్లో వన్డే మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ, సచిన్ తర్వాత ధోనీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ధోనీ విదేశాల్లో జరిగిన వన్డేల్లో 4,520 పరుగులు చేశాడు. ధోనీ తర్వాతి స్థానంలో రాహుల్ ద్రవిడ్ (3,998), సౌరభ్ గంగూలీ (3,468) పరుగులు చేసి టాప్-5లో ఉన్నారు. కాగా ఓవరాల్‌గా చూసుకుంటే విదేశాల్లో 50 ఓవర్ల ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కుమార సంగక్కర (5,518 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో విరాట్ కోహ్లీ (5,108), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (5,090) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

Exit mobile version