Virushka: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ – నటి అనుష్క శర్మ రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. గత కొన్నిరోజులుగా ఈ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నా.. విరుష్క ఈ వార్తలపై స్పందించింది లేదు. అయితే తాజాగా సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు, కోహ్లి సహచర ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశాడు. విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరం కావడానికి కారణం ఇదేనంటూ చెప్పుకొచ్చాడు. ” విరాట్ ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరం కావడానికి కారణం అనుష్క ప్రెగ్నెంట్ గా ఉంది. విరాట్.. ఈ సమయంలో ఆమెకు తోడుగా ఉండాలనుకున్నాడు. అందుకే టెస్టుల నుంచి దూరం అయ్యాడు. కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో విరాట్ ను మెచ్చుకొని తీరాలి.. ఇంతకన్నా ఎక్కువ సమాచారం ఇవ్వలేను” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు విరుష్కకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇకపోతే విరుష్క 2013 లో ఒక షాంపూ యాడ్ ద్వారా కలుసుకున్నారు. అప్పటి నుంచి వారి మధ్య పరిచయం మొదలయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారి.. ఇరు కుటుంబాలను ఒప్పించి.. ఈ జంట 2017 డిసెంబర్ 11న వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో డెస్టినేషింగ్ వెడ్డింగ్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ ప్రేమబంధానికి గుర్తింపుగా వామిక అనే కూతురు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల జీవితంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు వామిక ఫోటోను అధికారికంగా బయటకు చూపించింది కూడా లేదు. విరాట్.. వారి పర్సనల్ లైఫ్ ను చాలా గోప్యంగా ఉంచాలని చూస్తాడు. మరి త్వరలోనే వామిక ఆడుకోవడానికి చెల్లి వస్తాడో.. తమ్ముడు వస్తాడో చూడాలి.
