Site icon NTV Telugu

Ganguly-Virat : అబ్బో.. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారుగా..

Virat

Virat

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో తొలిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడినప్పుడు.. ఆర్సీబీ స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ మధ్య చాలా టెన్షన్ నెలకొంది. ఆ మ్యాచ్ కు సంబంధించిన అనేక వీడియోలు బయటకు వచ్చాయి. ఇందులో కోహ్లీ గుంగూలీపై దూకుడు చూపుతున్నట్లు కనిపించింది.

Also Read : Tim Cook: ఆపిల్ లేఆఫ్స్‌పై సీఈఓ టిమ్ కుక్ కీలక వ్యాఖ్యలు..

అయితే మ్యాచ్ తర్వాత ఈ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. అయితే శనివారం (మే6) రాత్రి ఇరు జట్లు మళ్లీ తలపడడంతో అభిమానులు మరోసారి హైవోల్టేజ్ డ్రామాను చూడటానికి వేచి ఉన్నారు. మ్యాచ్ లో ప్రతి అభిమాని చూపు కోహ్లీ-దాదా వైపే చూస్తున్నారు. అదే సమయంలో మ్యాచ్ ముగిసిన తర్వాత ఈసారి షేక్ హ్యాండ్ ఇస్తారా లేదో చూడాలని అంతా అనుకున్నారు.

Also Read : Surya Stotra: ఈ స్తోత్రాలు వింటే నష్టాల నివారణ జరిగి ఆశించిన ఫలితం పొందుతారు

కానీ ఈసారి అలాంటిదేమీ జరుగలేదు. ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ-సౌరబ్ గంగూలీ ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. విరాట్ కోహ్లీ, మహిపాల్ లోమ్రోర్ హాఫ్ సెంచరీలతో ఆధారంగా బెంగళూరు 181 పరుగులకు ఆలౌట్ అయింది.

Also Read : Currency Notes In Drain : మురికి కాల్వలో కరెన్సీ నోట్లు.. వీడియో చూస్తే మీరు షాకే..

కోహ్లీ తన ఇన్సింగ్స్ లో 55 పరుగుల చేయడంతో ఏడు వేల పరుగుల మైలు రాయిని అందుకున్నారు. ఇక 182 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 20 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఢిల్లీ తరపున ఫిల్ సాల్ట్ 87 పరుగులతో మెరుపు ఇన్సింగ్స్ ఆడాడు. ఈ ఇన్సింగ్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ కూడా అందుకున్నారు. ఈ విజయంతో ఢిల్లీ 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.

Exit mobile version