NTV Telugu Site icon

కోహ్లీ ర్యాంక్‌ పడిపోవడంపై చిన్ననాటి కోచ్‌ షాక్‌…

kohli

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ ఐదో స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయం పై అతడి చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ షాక్‌కు గురయ్యాడు. ఈ విషయం తాను విరాట్‌తో తప్పకుండా మాట్లాడతానని చెప్పాడు. రెండో టెస్టులో టీమిండియా గెలవడంపై సంతృప్తిగా ఉన్నానని.. పరుగుల గురించి ఆందోళన చెందట్లేదని కోహ్లీ చెప్పాడని తెలిపాడు. ఆ ఆటిట్యూడ్‌ ఉంటే కోహ్లీ తప్పకుండా సెంచరీ చేస్తాడని, ఎవరూ మోటివేట్‌ చేయాల్సిన అవసరం లేదన్నాడు. అయితే కోహ్లీ గత కొన్ని టెస్టులుగా పరుగులు చేయడానికి ఇబంధులు ఎదుర్కొంటున్నాడు. సునాయాసంగా సెంచరీ, డబుల్ సెంచరీలు చేసే రాం మిషన్ ఇప్పుడు కనీసం అర్ధ శతకం కూడా చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. చూడాలి మరి ఇప్పటి ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో నైనా కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తాడా… లేదా అనేది.