Site icon NTV Telugu

Viral Video: తాగిన మైకంలో రోడ్డు మీద రచ్చ చేసిన చాహల్, నెహ్రా

Chahal Nehra Video

Chahal Nehra Video

టీమిండియా మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు చాహల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీనియర్ కమ్ కోచ్ అయిన నెహ్రా చాహల్‌తో క్లోజ్‌గా ఉంటాడు. అయితే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన అనంతరం ఓ పార్టీలో మద్యం సేవించగా.. అనంతరం రోడ్డు మీద ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. పార్టీ అయిపోయిన తర్వాత చాహల్‌ను నెహ్రా ‘అరే బస్‌లో వెళ్దాం రా’ అంటే దానికి ‘అన్నా నేను కార్లో వెళ్తా.. నా వైఫ్ కూడా ఉంది. తనను వదిలి ఎలా రావాలి’ అంటూ చాహల్ సమాధానమిచ్చాడు.

దీంతో నెహ్రా స్పందిస్తూ.. ‘అవునా.. నీ భార్య కూడా మనతో పాటే బస్‌లో వస్తుంది పదా..’ అంటూ కారు ఎక్కబోతున్న చాహల్ భార్య ధనశ్రీ వర్మను కూడా బస్ దగ్గరికి తీసుకెళ్లాడు. అయితే ఈ ఇద్దరి మాటలు, ప్రవర్తన చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. తప్ప తాగి రోడ్డు మీద ఈ రచ్చ ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో చాహల్ 17 మ్యాచ్‌లు ఆడి 27 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఓ హ్యాట్రిక్‌తో పాటు ఒక మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శన చేసిన చాహల్‌కే పర్పుల్ క్యాప్ దక్కింది.

Exit mobile version