Vibhav suryavanshi: ఢిల్లీ క్యాపిటల్స్ పశ్చాత్తాపం.. కొన్ని లక్షల కోసం వైభవ్‌ను వదులుకున్నారు..

  • ఐపీఎల్‌ను ఊపేస్తున్న వైభవ్ సూర్యవంశీ..
  • ఇప్పుడు బాధపడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్..
  • కొన్ని లక్షల కోసం రాజస్థాన్‌కు వదులుకుని పశ్చాత్తాపం..
Vibhav Suryavanshi

Vibhav Suryavanshi

Vibhav suryavanshi: వైభవ్ సూర్యవంశీ, ఒక్క మాటలో చెప్పాంటే విధ్వంసం. బ్యాట్‌తో టచ్ చేస్తే చాలు సిక్స్ లేదా బౌండరీ ఇలా అతడి దూకుడుకు అన్ని జట్లు బెదిరిపోతున్నాయి.ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 29 బాల్స్‌లో 12 సిక్సర్లు, 5 ఫోర్లతో 97 రన్స్ చేశాడు. హైదరాబాద్ ఓటమికి కారణమయ్యాడు. 30 బంతుల్లో క్రిస్ గేట్ సెంచరీ రికార్డ్‌ను బద్ధలు కొట్టే ముందు ఔట్‌గా వెనుదిరిగారు. ఈ 15 ఏళ్ల సంచలనం భారత క్రికెట్‌కు భవిష్యత్ తారగా మారబోతున్నాడు. 2026 ఐపీఎల్‌లో 15 మ్యాచ్‌లలో 680 పరుగులు చేసి, ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు.

15 ఏళ్ల చిచ్చరపిడుగు ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వడం కూడా సంచలనమే. వైభవ్‌ను దక్కించుకోనందుకు ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) బాధపడుతుంటుంది. ఎందుకంటే 2025 ఐపీఎల్ కోసం జెడ్డాలో 2024 నవంబర్‌లో వేలం జరిగింది. ఆ సమయంలో వైభవ్ వయసు 13 ఏళ్లు. వైభవ్ కనీస ధర రూ. 30లక్షలు కాగా, రాజస్థాన్ రాయల్స్ ఇతడిని రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది.

×
×
Ad

ఈ వేలంలో డీసీ, రాయల్స్ మధ్య పోటీ నెలకొంది. కేవలం కొన్ని లక్షల కోసం ఫైనల్‌గా డీసీ వదులుకుంది. మొత్తం 16 బిడ్లు వచ్చాయి. రూ. 30 లక్షల ననుంచి ప్రారంభమైన వేలం క్రమంగా రూ. 1.10 కోట్లకు చేరుకుంది. వైభవ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1 కోటి వరకు వెళ్లింది. అయితే, రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు అతడిని దక్కించుకుంది.

వేలం సాగింది ఇలా:

1) ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 30 లక్షలు
2) రాజస్థాన్ రాయల్స్ – రూ. 35 లక్షలు
3) ఢిల్లీ క్యాపిటల్స్ – 40 లక్షలు
4) రాజస్థాన్ రాయల్స్ – రూ. 45 లక్షలు
5) ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 50 లక్షలు
6) రాజస్థాన్ రాయల్స్ – రూ. 55 లక్షలు
7) ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 60 లక్షలు
8) రాజస్థాన్ రాయల్స్ – 65 లక్షలు
9) ఢిల్లీ క్యాపిటల్స్ – 70 లక్షలు
10) రాజస్థాన్ రాయల్స్ – రూ 75 లక్షలు
11) ఢిల్లీ క్యాపిటల్స్ – 80 లక్షలు
12) రాజస్థాన్ రాయల్స్ – 85 లక్షలు
13) ఢిల్లీ క్యాపిటల్స్ – 90 లక్షలు
14) రాజస్థాన్ రాయల్స్ – 95 లక్షలు
15) ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 1 కోటి
16) రాజస్థాన్ రాయల్స్ – ₹1.10 కోట్లు (తుది బిడ్)