Dhawan: కుర్రాళ్ల దెబ్బ.. ధావన్ ప్లేస్ గల్లంతు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టీమిండియా మంచి జోరు మీదుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో వరుస సిరీస్‌లు గెలుస్తూ దూసుకెళ్తోంది. అలాగే జట్టులోకి కొత్తగా వచ్చిన ప్లేయర్లు సూపర్ ఫామ్ చూపిస్తుండటం భారత్‌కు మరింత బలంగా మారింది. ఇందులో రోహిత్‌కు జోడీగా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అతను లేకపోతే ఓపెనింగ్ చేయడం కోసం ఇషాన్ కిషన్ రెడీగా ఉన్నాడు. గిల్ తన చివరి ఆరు వన్డేల్లో మూడు సెంచరీలు చేశాడు. వీటిలో ఒక డబుల్ సెంచరీ కూడా ఉండటం గమనార్హం. అలాగే ఇషాన్ కిషన్ కూడా బంగ్లాదేశ్‌పై భారీ డబుల్ సెంచరీ బాదాడు. ఇలాంటి క్రమంలో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెరీర్ దాదాపు ముగిసినట్లే అనిపిస్తోంది.
Sania Mirza: కెరీర్ చివరి టోర్నీలో ఫైనల్‌కు సానియా..టైటిల్ దక్కుతుందా!
Also Read
- SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
- Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
కాగా, గత మూడేళ్లలో ధావన్ ఒక్క అంతర్జాతీయ సెంచరీ కూడా చేయలేకపోయాడు. 2020-2021 సీజన్‌లో మాత్రం అదరగొట్టాడు. సుమారు 50 సగటుతో పరుగులు చేశాడు. కానీ 2021-2022 సీజన్‌లో ధావన్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. గతేడాది టీ20 వరల్డ్ కప్ ఉండటంతో రోహిత్, విరాట్ వంటి సీనియర్లు వన్డే ఫార్మాట్లో ఆడలేదు. ఈ క్రమంలో ఆ జట్టుకు ధావన్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. గతేడాది చాలా టోర్నీల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన శిఖర్.. 22 మ్యాచ్‌ల్లో కేవలం 34 సగటు, 74 స్ట్రైక్ రేటుతో 688 పరుగులు మాత్రమే చేశాడు.
MS Dhoni: ‘షోలే 2’లో ధోనీ, హార్దిక్!..వైరల్ అవుతోన్న ఫోటో
అదే సమయంలో అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్న యంగ్ ప్లేయర్ గిల్ తన ఆటతీరును చాలా మెరుగు పరుచుకున్నాడు. అద్భుతమైన వన్డే బ్యాటర్‌గా పరిణితి చెందాడు. వరుస సెంచరీలతో దూసుకెళ్తు్న్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మొత్తం 360 రన్స్ చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గానూ నిలిచాడు. ఇకపోతే, కిషన్ కూడా ఓపెనర్‌గా సత్తా చాటుతున్నాడు. అవకాశం వస్తే చాలు దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. దీంతో ఇక మళ్లీ ధావన్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వెటరన్ బ్యాటర్ మళ్లీ ఫామ్ అందుకున్నా.. గిల్, కిషన్ ఫామ్‌లో ఉన్నంత కాలం ధావన్‌కు అవకాశం రావడం అసాధ్యం అని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!