Sania Mirza: కెరీర్ చివరి టోర్నీలో ఫైనల్‌కు సానియా..టైటిల్ దక్కుతుందా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఆస్ట్రేలియా ఓపెన్‌లో అదరగొడుతోంది, విమెన్స్ డబుల్స్‌లో నిరాశ పర్చినా.. మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి సూపర్ పెర్ఫామెన్స్‌తో దూసుకెళ్తోంది. అద్భుత ఆటతీరుతో దూసుకుపోతున్న సానియా – బోపన్న జోడీ సెమీఫైనల్లో బ్రిటన్, అమెరికాకు చెందిన నీల్ సుపాస్కి-డిసీర్ క్రాజిక్లపై 7-6, 6-7, 10-6 తేడాతో విజయాన్ని సాధించి గ్లాండ్స్లామ్ ఫైనల్లో అడుగుపెట్టారు. క్వార్టర్స్‌లో వాకోవర్ లక్‌తో సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సానియా-బోపన్న జోడి.. సెమీస్‌లో పాయింట్ పాయింట్‌కి పోరాడాల్సి వచ్చింది. గంటా 52 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగిందంటే ఉత్కంఠ ఏ రేంజ్లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. తొలి రెండు సెట్లు టై బ్రేకర్‌కు దారి తీయగా.. సానియా జోడీ తొలి సెట్, నీల్-క్రాజిక్ జోడీ రెండో సెట్ గెలుచుకున్నాయి. ఇక నిర్ణయాత్మక మూడో సెట్ అయితే సూపర్ టై బ్రేకర్‌కు దారి తీసింది. కానీ చివరకు ఈ భారత్ వెటరన్ జోడినే విజయం వరించింది. శనివారం జరగనున్న ఫైనల్లో స్టెఫానీ-మాథోస్లతో సానియా – బోపన్న తలపడనున్నారు.
కెరీర్లో సానియా మీర్జాకు ఇదే చివరి గ్లాండ్స్టామ్ టోర్నమెంట్. ఫిబ్రవరిలో టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు ఇటీవలే సానియా స్పష్టం చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచి కెరీర్‌ను ఘనంగా ముగించే అవకాశం సానియాకు లభించింది. ఫైనల్లో సానియా – బోపన్న జోడి ఇదే జోరును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటివరకు రెండు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ చేజిక్కించుకుంది సానియా. మిక్స్డ్ డబుల్స్‌లో ఒకసారి, మరోసారి విమెన్స్ డబుల్స్‌లో విజేతగా నిలిచింది. మరో మూడు సార్లు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
Also Read
- IPL 2027-MS Dhoni: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడతాడా?.. ఏడాది ఉత్కంఠకు తెర!
- IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
- IND vs NZ 1st Test: తొలి టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ కాంబినేషన్ ఖరారు.. గిల్ కీలక వ్యాఖ్యలు!
- IPL 2027-SRH: నకిలీ బౌలింగ్‌తో ఇన్నాళ్లు కొనసాగాడు.. తుది జట్టులోకి ఎలా వస్తాడో అర్థం కావడం లేదు!
సానియా భావోద్వేగం
కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న సానియా మ్యాచ్ సమయంలోనూ, గెలిచిన తర్వాత చాలా ఎమోషనల్‌గా కనిపించింది. ఇది అద్భుతమైన మ్యాచ్ అని.. ఎంతో ఒత్తిడి ఎదుర్కొన్నామంటూ మ్యాచ్ తర్వాత సానియా తెలిపింది. తన చివరి గ్రాండ్‌స్లామ్‌లో బోపన్నతో ఆడడం ప్రత్యేకంగా ఉందని.. ఇప్పుడు తనకు 36 ఏళ్లు.. బోపన్నకు 42 ఏళ్లు.. మేమింకా ఆడుతున్నామంటూ ఎమోషనల్ అయ్యింది. తాను సాధారణంగా ఏడ్చేదాన్ని కాదు అని.. అయితే ఇప్పుడు ఆ ఫిలింగ్‌ను ఆపుకుంటున్నానంటూ ఏడ్చినంత పని చేసింది సానియా. తన కొడుకును ఎత్తుకుని గట్టిగా హగ్ కూడా చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ఫుల్ వైరల్‌గా మారింది.
Wholesome content alert 👶@MirzaSania's son, Izhaan, ran out on court to celebrate her reaching the #AusOpen mixed doubles final 🥰#AO2023 pic.twitter.com/VLiHGSRgiN
— #AusOpen (@AustralianOpen) January 25, 2023
తాజావార్తలు
-
Windfall Tax Hike: కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్ ఎగుమతులపై పన్ను లీటరుకు రూ.14కు పెంపు.. పెట్రోల్‌పై జీరో డ్యూటీ!
-
IPL 2027-MS Dhoni: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడతాడా?.. ఏడాది ఉత్కంఠకు తెర!
-
Indian Employees Emergency Savings: జీతం వస్తేనే జీవనం.. భారత ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై సంచలన సర్వే..!
-
Motorola Edge 70 Neo: మోటరోలా Edge 70 Neo భారత్‌లోకి వచ్చేస్తోంది.. 50MP Sony కెమెరా, 7,000mAh బ్యాటరీతో!
-
Varanasi Update: ఇదొక అప్డేటే.. అసలైన బ్లాస్ట్ కోసం వేచి చూడాల్సిందే!
ట్రెండింగ్
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!