Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్‌పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ నైపుణ్యం గురించి క్రికెట్ ప్రపంచమంతటికీ బాగా తెలుసు. క్రీజులోకి వస్తే కేవలం కొన్ని ఓవర్లలోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల అద్భుతమైన సామర్థ్యం అతని సొంతం. అయితే, బ్యాటింగ్‌లో ఎంతటి గుర్తింపు తెచ్చుకున్నా, అతని ఫీల్డింగ్ విషయానికొచ్చేసరికి ఎప్పుడూ కొన్ని సందేహాలు, విమర్శలు వస్తూనే ఉండేవి. ఈ బలహీనత కారణంగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అతన్ని కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం చేస్తూ, పలు మ్యాచ్‌ల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూపంలో ఉపయోగించుకుంది. కొన్ని సందర్భాల్లో అతను మైదానంలో క్యాచ్‌లు వదిలేసి నిరాశపరిచిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ.. తాజాగా ఇండియా-ఏ తరఫున ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శనతో అందరి నోళ్లు మూయించాడు. తన ఫీల్డింగ్‌పై వస్తున్న విమర్శలకు మైదానంలోనే సమాధానం ఇచ్చాడు.
రంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ఖాలీద్ తనివాల్, భారత బౌలర్ అన్షుల్ కంబోజ్ వేసిన బంతిని లెగ్ సైడ్ వైపు గాల్లోకి బలంగా బాదాడు. ఆ సమయంలో మిడ్ వికెట్ స్థానంలో ఫీల్డింగ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ, బంతిని ఎలాగైనా ఆపాలని గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి వేగం, ఎత్తు ఎక్కువగా ఉండటంతో అది అతని చేతికి తగిలి వెనుక వైపునకు దూసుకెళ్లింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఫీల్డర్లు క్యాచ్ చేజారిందని వదిలేస్తుంటారు.
Also Read
- Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
- India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
- WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
- Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
Sooryavanshi pulls off a stunner! 🤯
Watch the #TalentTVCup LIVE on #SonyLIV & #SonySportsNetwork 📺 pic.twitter.com/lpQwBXX79c
— Sony LIV (@SonyLIV) June 17, 2026
కానీ వైభవ్ మాత్రం అస్సలు పట్టు వదల్లేదు. చురుగ్గా స్పందిస్తూ బంతి వెనుకే పరిగెత్తాడు. చివరి క్షణంలో అసాధ్యమైన రీతిలో గాల్లోకి డైవ్ చేసి, ఆ బంతిని అద్భుతంగా రెండు చేతుల్లోకి అందుకున్నాడు. గాల్లో తేలుతూ అతను పట్టిన ఈ అద్భుత క్యాచ్‌ను చూసి స్టేడియంలోని ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు సైతం నోరెళ్లబెట్టారు. ఈ అద్భుత ప్రదర్శనతో తాను కేవలం బ్యాటింగ్‌లోనే కాదు, ఫీల్డింగ్‌లోనూ మ్యాచ్‌లను మలుపు తిప్పగలనని వైభవ్ నిరూపించాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
ట్రెండింగ్
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!