Site icon NTV Telugu

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సంచలన నిర్ణయం!

Vaibhav Sooryavanshi History

Vaibhav Sooryavanshi History

Vaibhav Sooryavanshi Skips 10th Exams for IPL 2026: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్‌ కోసం చదువును పక్కన పెట్టాడు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు స్కిప్ చేయాలని వైభవ్ స్వయంగా నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని వైభవ్ తండ్రి సంజీవ్‌ సూర్యవంశీ వెల్లడించారు. తన కుమారుడు పదో తరగతి పరీక్షలు వచ్చే ఏడాది రాస్తాడని స్పష్టం చేశారు. ఈ ఏడాది పరీక్షలకు హాజరైనా.. పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయేవాడని సంజీవ్‌ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చదువు పక్కన పెట్టి పూర్తిగా క్రికెట్‌పైనే దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు.

సంజీవ్‌ సూర్యవంశీ మాట్లాడుతూ… ‘ప్రస్తుతం వైభవ్ నాగ్‌పూర్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ ఏడాది వైభవ్ పరీక్షల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈసారి పదో తరగతి పరీక్షలు స్కిప్ చేయాలని వైభవ్ స్వయంగా నిర్ణయించుకున్నాడు. వచ్చే ఏడాది పరీక్షలు రాస్తాడు. ఈ ఏడాది పరీక్షలకు హాజరైనా.. వైభవ్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయేవాడు. ఒత్తిడిలో ఏ పని చేయొద్దు. చదువులో వైభవ్‌ ఎప్పుడూ ముందే ఉంటాడు. స్కూల్‌కి రెగ్యులర్‌గా వెళ్లినప్పుడు చదువులో మంచి ప్రతిభ కనబరిచేవాడు. అన్ని సబ్జెక్టుల్లో 90 శాతం పైగా మార్కులు సాధించేవాడు. అయితే ఇప్పుడు అతడి ప్రధాన లక్ష్యం క్రికెట్ కావడంతో చదువుపై దృష్టి పెట్టడం కష్టమవుతోంది’ అని చెప్పారు.

Also Read: Dasun Shanaka: కలలో కూడా ఊహించలేదు, ఇది అవమానకరం.. జింబాబ్వేపై ఓటమిపై షనక సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం సంజీవ్‌ సూర్యవంశీ కెరీర్‌కు కీలకమైన దశలో ఉన్నందున పూర్తిగా ఆటపై దృష్టి పెట్టడం అవసరమని అందరం మద్దతు ఉన్నాం అని సంజీవ్‌ సూర్యవంశీ తెలిపారు. యువ వయసులోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ధైర్యమైన అడుగే అయినప్పటికీ, తన కలను నెరవేర్చేందుకు వైభవ్ కట్టుబడి ఉన్నాడని గర్వంగా చెప్పారు. క్రికెట్‌లో పెద్ద స్థాయికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్న వైభవ్ ప్రయాణం ఎలా కొనసాగుతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా ఆతడు భారత జట్టు ఎంట్రీకి దగ్గరగా వచ్చేశాడు. ఐపీఎల్ 2026లో రాణిస్తే.. ఈ ఏడాది అతడికి టీమిండియాలో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు. అండర్‌-19 వరల్డ్‌కప్‌ 2026లోనూ వైభవ్‌ అదరగొట్టాడు. ఇంగ్లండ్‌పై ఫైనల్లో 80 బంతుల్లో 175 రన్స్ బాది.. భారత్‌ టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

Exit mobile version