Vaibhav Sooryavanshi History: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఏకంగా 110 సిక్సర్లు!

  • భారత యువ క్రికెట్‌లో సంచలనంగా వైభవ్ సూర్యవంశీ
  • ప్రపంచప్‌ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్
  • 55 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ
Vaibhav Sooryavanshi History

Vaibhav Sooryavanshi History

Vaibhav Sooryavanshi History: భారత యువ క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందుకు కారణం 2026 అండర్‌-19 ప్రపంచప్‌ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడడమే. 80 బంతుల్లో 15 సిక్సులు, 15 ఫోర్లతో 175 రన్స్ చేశాడు. 55 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ చేసిన వైభవ్.. ఆపై 25 బంతుల్లోనే 75 రన్స్ చేశాడు. 218.75 స్ట్రైక్‌రేట్‌తో రన్స్ చేసి ఇంగ్లాండ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు.

అండర్‌-19 ప్రపంచప్‌ 2026లో వరుస సిక్సులు బాదిన వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత సాధించాడు. కేవలం 25 యూత్ వన్డే ఇన్నింగ్స్‌ల్లోనే అతడు 110 సిక్సర్లు బాది రికార్డుల్లో నిలిచాడు. బంగ్లాదేశ్ యువ ఆటగాడు జవాద్ అబ్రార్ రెండో స్థానంలో ఉన్నాడు. అబ్రార్ 33 ఇన్నింగ్స్‌ల్లో 55 సిక్సర్లు మాత్రమే బాదాడు.అంటే వైభవ్ ఆధిపత్యం ఎలా ఉందో ఇట్టే అర్ధమవుతోంది. యూత్ వన్డేల్లో వైభవ్ బ్యాటింగ్ శైలి పూర్తిగా ఆధునిక క్రికెట్‌కు అద్దం పడుతోంది. ఎలాంటి భయం లేకుండా.. ఇన్నింగ్స్ మొదటి బంతి నుంచే దాడికి దిగడం అతడి ప్రత్యేకత. పవర్‌తో పాటు టైమింగ్ కూడా అద్భుతంగా ఉండడంతో అతడి షాట్లు సునాయాసంగా బౌండరీ దాటుతున్నాయి. అందుకే చిన్న వయసులోనే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు.

అండర్‌-19 ప్రపంచప్‌ 2026 ఫైనల్ మ్యాచ్‌లో గణాంకాలు కూడా వైభవ్ ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇన్నింగ్స్ తొలి 25 ఓవర్లలో భారత్‌ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 250 పరుగులు చేసింది. ఓవర్‌కు సగటున 10 పరుగుల వేగంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఈ దశలో వైభవ్ బ్యాట్ నుంచి పరుగుల వరద పారింది. బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోరింగ్ రేట్‌ను ఆకాశానికి చేర్చాడు. అయితే 25.3 ఓవర్ల వద్ద వైభవ్ ఔట్ అయిన తర్వాత ఇన్నింగ్స్‌ రిథమ్ కొంత తగ్గింది. 26 నుంచి 50 ఓవర్ల మధ్య భారత్‌ 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో రన్‌రేట్ 6.44కి పడిపోయింది. ఈ గణాంకాలే వైభవ్ జట్టుకు ఎంత కీలక ఆటగాడో చెప్పకనే చెబుతున్నాయి.

Also Read: India U19 Team History: వరల్డ్‌కప్‌లో భారత్‌ సరికొత్త చరిత్ర.. తొలి జట్టుగా రేర్ రికార్డు!

వైభవ్ సూర్యవంశీ కేవలం భారీ షాట్లు ఆడే బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు.. జట్టు స్కోర్ వేగాన్ని నిర్ణయించే కీలక ఆటగాడు కూడా. యూత్ క్రికెట్‌లో అతడు చూపిస్తున్న దూకుడు, స్థిరత్వం భారత క్రికెట్ భవిష్యత్తుకు మంచి సంకేతం. సరైన మార్గదర్శకత్వం, క్రమశిక్షణ కొనసాగితే.. వైభవ్ పేరు రానున్న రోజుల్లో సీనియర్ క్రికెట్‌లో కూడా గట్టిగా వినిపించడం ఖాయం. వైభవ్ అతి త్వరలోనే టీమిండియాలోకి వచ్చేలా ఉన్నాడు.