Vaibhav Sooryavanshi’s Promising Start Ends Early: శ్రీలంకలో జరుగుతున్న ట్రై నేషన్ ఏ సిరీస్ 2026 తొలి మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. దంబుల్లాలోని రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంక-ఏతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా-ఏ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత ఓపెనర్లను తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చారు.
భారత అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మ్యాచ్ ప్రారంభంలోనే మహ్మద్ షిరాజ్ బౌలింగ్‌లో రెండు అద్భుతమైన ఫోర్లు బాదాడు. ఒక బౌండరీని పాయింట్ వైపు అద్భుతంగా ఆడగా.. మరో షాట్‌ను మిడ్ ఆఫ్ మీదుగా లాఫ్ట్ చేసి ప్రేక్షకులను అలరించాడు. అనంతరం చమిక కరుణరత్నే బౌలింగ్‌లో కూడా మరో ఫోర్ కొట్టి మంచి టచ్‌లో కనిపించాడు. అయితే బుడ్డోడు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. షిరాజ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
వైభవ్ సూర్యవంశీ 12 బంతుల్లో 3 ఫోర్లతో 14 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో కనీసం హాఫ్ సెంచరీ బాదుతాడనుకున్న అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యాడు. టీంఇండియాలోకి ఎంపిక సమయంలో వైభవ్ ఇలా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడం అతడికి మైనస్ అనే చెప్పాలి. ఐపీఎల్ 2026లో వైభవ్ 700కు పైగా రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక వైభవ్ వికెట్ పడిన కొద్ది సేపటికే ఇండియా-ఏ మరో వికెట్ కూడా కోల్పోయింది. వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ 11 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి.. చమిక కరుణరత్నే బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో కేవలం 18 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో పడింది.
ప్రస్తుతం క్రీజులో ప్రియాంశ్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. సీనియర్ ప్లేయర్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. ఐపీఎల్ స్టార్ ప్రియాంశ్ కూడా ధాటిగా ఆడుతున్నాడు. మిడిల్ ఓవర్లలో కెప్టెన్ తిలక్ వర్మ, ఆయుష్ బడోని వంటి బ్యాటర్లు భారత్‌కు ఉన్నారు. వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో అతడు మరోసారి దూకుడుగా ఆరంభించినా.. ఆ ఇన్నింగ్స్‌ను పెద్ద స్కోరుగా మార్చుకోలేకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. అయినప్పటికీ అతడు ఆడిన కొన్ని షాట్లు అతడి ప్రతిభను మరోసారి చాటిచెప్పాయి.

