Usain Bolt: జమైకా పరుగుల యంత్రం ఉస్సేన్ బోల్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరుతపులి కంటే వేగంగా పరిగెత్తగల సామర్థ్యం అతడి సొంతం. ఒలింపిక్స్ లాంటి మహా క్రీడల్లో ఏకంగా 8 సార్లు గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన క్రీడాకారుడు ఉస్సేన్ బోల్ట్ మాత్రమే. అయితే అథ్లెట్‌గా రిటైర్ అయిన ఉసేన్ బోల్ట్ త్వరలో క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఎట్టకేలకు క్రికెటర్ అవ్వాలన్న కలను త్వరలో నెరవేర్చుకోబోతున్నాడు. ఇప్పటికే క్రికెటర్‌గా మారడానికి క్రికెట్ కోచింగ్ పాఠాలు వింటూ ప్రాక్టీస్‌లో ఉస్సేన్ బోల్ట్ బిజీ అయ్యాడు. చిన్ననాటి నుంచే క్రికెటర్ అవ్వాలని కోరిక ఉన్నా పరిస్థితుల కారణంగా అథ్లెట్‌గా మారి రికార్డులు సృష్టించాడు.
Read Also:Loan Apps Culprits Arrest: లోన్ యాప్ వేధింపులు.. నలుగురి అరెస్ట్
ఉస్సేన్ బోల్ట్ త్వరలో జరగనున్న గ్లోబల్ టీ20 పవర్ క్రికెట్ లీగ్‌లో ఆడనున్నాడు. ఈ మేరకు టోర్నీ నిర్వాహకులు ఇప్పటికే బోల్ట్‌కు ఆహ్వానం పంపారు. ఢిల్లీలో అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9 వరకు గ్లోబల్ టీ20 క్రికెట్ లీగ్ టోర్నీ జరగనుంది. గత సంవత్సరం రిటైర్డ్ స్ప్రింటర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడాలని తన కోరికను వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో బోల్డ్ క్రికెట్ లీగ్ టోర్నీలో ఆడబోతున్నాడు. ఈ మేరకు భారతదేశపు మొట్టమొదటి ప్రత్యక్ష డిజిటల్ స్పోర్ట్స్ ఛానెల్ అయిన పవర్ స్పోర్ట్స్ జమైకన్ లెజెండ్‌ను ఆహ్వానించింది. జీపీసీఎల్ విషయానికి వస్తే.. ఇది వివిధ దేశాల నుంచి 8 జట్లు పాల్గొనే టీ20 ఈవెంట్. ఈ టోర్నమెంట్‌తో నిర్వాహకులు క్రికెట్‌ను గ్లోబల్‌గా తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. GPCL మొదటి సీజన్ NRI ఉత్సవ్ కింద భారతదేశంలో జరుగుతుండగా.. త్వరలో ఇది మిడిల్ ఈస్ట్, అమెరికా, కెనడా, యూకే, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో కూడా జరగనుంది.
