Urvil Patel: పొట్టుపొట్టు కొట్టిన ఉర్విల్ పటేల్.. ఐపీఎల్ హిస్టరీలోనే నయా రికార్డ్ .. 13 బంతుల్లోనే ఫిఫ్టీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Urvil Patel: ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ (CSK), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగిన పోరులో రికార్డుల మోత మోగింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి సరికొత్త చరిత్ర సృష్టించాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియం సాక్షిగా ఉర్విల్ పటేల్ పరుగుల తుపాను సృష్టించాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలోనే నయా రికార్డ్ నెలకొల్పాడు. లక్నో నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఉర్విల్ కేవలం 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
చరిత్ర సృష్టించిన ఇన్నింగ్స్..
గతంలో రాజస్థాన్ రాయల్స్ తరపున యశస్వి జైస్వాల్ (2023లో కేకేఆర్ పై) సాధించిన 13 బంతుల ఫిఫ్టీ రికార్డును ఉర్విల్ ఈరోజు సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 23 బంతులు ఆడిన ఉర్విల్ 65 పరుగులు చేశాడు. ఇందులో 8 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. అంటే 56 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే రావడం విశేషం. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సీఎస్కే అద్భుత ప్రదర్శన కనబరిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత ఓవర్లలో 204 పరుగుల భారీ లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచింది. నిజానికి ఈ రెంజ్ స్కోరును చూసి ఫ్యాన్స్ ఈ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుందని భావించారు. కానీ ఉర్విల్ పటేల్ రావడం రావడంతోనే తన మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను పూర్తిగా ఏకపక్షంగా మార్చేశాడు. మొదటి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి సీఎస్కే విజయాన్ని దగ్గర చేశాడు. ఉర్విల్ పటేల్ సృష్టించిన ఈ విధ్వంసం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్‌ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
- Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
- 2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
A record knock 🤯
A memorable celebration with a 𝗵𝗲𝗮𝗿𝘁𝗳𝗲𝗹𝘁 𝗺𝗲𝘀𝘀𝗮𝗴𝗲 🥹🫶Urvil Patel, thank you for the entertainment today 💛
Updates ▶️ https://t.co/MoXhlWHk4O#TATAIPL | #KhelBindaas | #CSKvLSG | @ChennaiIPL pic.twitter.com/GjR5D2sYid
— IndianPremierLeague (@IPL) May 10, 2026
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!