NTV Telugu Site icon

Umran Malik: షోయబ్ అఖ్తర్ రికార్డ్‌ని తప్పకుండా బద్దలుకొడతా

Umran Malik On Akhtar

Umran Malik On Akhtar

Umran Malik Says He Will Definitely Break Shoaib Akhtar Record: రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అఖ్తర్ పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన బంతి రికార్డ్‌ని తాను తప్పకుండా బద్దలు కొడతానని టీమిండియా యువపేసర్ ఉమ్రాన్ మాలిక్ ధీమా వ్యక్తం చేశాడు. అత్యంత వేగంతో బంతిని విసిరి, అఖ్తర్‌ను అధిగమిస్తానని పేర్కొన్నాడు. స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌లకు టీమిండియాలో ఉమ్రాన్ మాలిక్ చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా.. షోయబ్ అఖ్తర్ రికార్డ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదృష్టవశాత్తూ అంతా సాఫీగా జరిగి, తన ప్రదర్శన బాగుంటే మాత్రం.. కచ్ఛితంగా అఖ్తర్ పేరుపై ఉన్న రికార్డ్‌ని బ్రేక్ చేస్తానన్నాడు. అయితే.. తనకు వ్యక్తిగత రికార్డుల కన్నా, జట్టు ప్రయోజనాలే మరింత ప్రాధాన్యమని తెలిపాడు.

Irfan Pathan: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై బీసీసీఐకి ఇర్ఫాన్ ‘హెచ్చరిక’

తాను రికార్డుల గురించి ఆలోచించనని, దేశం కోసం జట్టుని గెలిపించాలన్నదే తన లక్ష్యమని ఉమ్రాన్ మాలిక్ అన్నాడు. నిజానికి.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో తాను ఎంత వేగంగా బంతిని విసురుతానన్న సంగతి తనకు తెలియదని పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాతే తాను ఈ విషయాల్ని తెలుసుకోగలుగుతానన్నాడు. తన ధ్యాస.. ఎంత వేగంతో బంతిని విసురుతానన్న అంశం మీద కాకుండా, సరైన ఏరియాలో బంతి పడుతుందా? లేదా? అనేది అంచనా వేసి విసిరడం మీదే ఉంటుందని తెలిపాడు. కాగా.. 2003 వరల్డ్‌కప్ టోర్నీలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షోయబ్ అఖ్తర్ 161.3 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేశాడు. ఇప్పటికీ ఆ రికార్డ్ బ్రేక్ అవ్వలేదు. ప్రస్తుతం 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేస్తున్న ఉమ్రాన్.. ఆ రికార్డ్‌ని బ్రేక్ చేస్తానని నమ్మకంతో ఉన్నాడు. మరి, ఆ రికార్డ్ బద్దలుకొడతాడో లేదో చూడాలి.

Perni Nani: తెలంగాణ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు.. ఏపీకి ద్రోహం చేశారు