IND vs PAK: నవంబర్ 5న భారత్‌–పాకిస్థాన్‌ హైఓల్టేజ్‌ పోరు!

India Vs Pakistan U19

India Vs Pakistan U19

India vs Pakistan Clash on November 5: అండర్‌-19 ఆసియా కప్‌ 2026 షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) ప్రకటించింది. ఒమన్‌ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో ఆసియా ఖండానికి చెందిన ఎనిమిది జట్లు టైటిల్‌ కోసం పోటీపడనున్నాయి. నవంబర్‌ 5న టోర్నీ ప్రారంభం కానుండగా.. ఫైనల్‌ మ్యాచ్‌ నవంబర్‌ 14న జరగనుంది. ఈ టోర్నీని వన్డే (50 ఓవర్ల) ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. టోర్నీలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్‌–పాకిస్థాన్‌ మ్యాచ్‌ నవంబర్‌ 5న జరగనుంది. టోర్నీ ప్రారంభ రోజే ఈ రెండు దాయాది జట్లు తలపడనున్నట్లు ఏసీసీ ప్రకటించింది. యువ క్రికెటర్ల మధ్య జరిగే ఈ హైఓల్టేజ్‌ పోరు టోర్నీకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ఆసియా కప్‌ 2026లో ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-ఏలో భారత్‌, పాకిస్థాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), నేపాల్‌ జట్లు ఉన్నాయి. గ్రూప్‌-బీలో బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, శ్రీలంక, మలేషియా జట్లకు చోటు కల్పించారు. ఈ గ్రూప్‌ దశలో జట్లు మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగి టైటిల్‌ పోరుకు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకోనున్నాయి. ఒమన్‌లో ఆసియా యువ క్రికెటింగ్‌ ప్రతిభను వెలికితీసే వేదికగా ఈ టోర్నీ నిలవనుంది. అండర్‌-19 స్థాయిలో రాణించే ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్‌లో తమ సత్తా చాటుకునేందుకు ఇది కీలక అవకాశం. ముఖ్యంగా భారత యువ జట్టు టైటిల్‌ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.