Site icon NTV Telugu

Bhopal: భోపాల్‌లో ఘోర విషాదం.. రోడ్డుప్రమాదంలో ఆసియా కప్ విజేత దుర్మరణం

Bhopal

Bhopal

భోపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆసియా కప్ బంగారు పతక విజేతతో సహా సహచర భారత నేవీ కయాకర్ ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూాడా చదవండి: Haryana: ఫరీదాబాద్‌లో ఉగ్ర కలకలం… భారీగా మందుగుండు సామగ్రి స్వాధీనం

ఆదివారం తెల్లవారుజామున భోపాల్‌లోని పర్వాలియా ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆసియా కప్ బంగారు పతక విజేత విష్ణు రఘునాథన్ (27), నేవీ కయాకర్ అనంత్ కృష్ణన్ (18) ప్రాణాలు కోల్పోయారు. నావికాదళ యూనిట్‌లో శిక్షణ కోసం ఇద్దరూ కూడా భూపాల్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రాక్టీస్ కోసం బోట్ క్లబ్‌కు ఆదివారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. రక్షా బీహార్ కాలనీ సమీపంలో బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇది కూాడా చదవండి: Odisha: జాజ్‌పూర్‌‌లో హడలెత్తించిన కీటకాల దండు.. బ్యాలెన్స్ కోల్పోయి కిందపడ్డ బైకర్లు

విష్ణు ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే చనిపోగా.. అనంత్ సోమవారం ఉదయం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ప్రమాద స్థలంలో రక్తపు మరకలు, రెండు హెల్మెట్లు, విరిగిన స్థంభం నుంచి ఆధారాలను ఫోరెన్సిక్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. భారీ వాహనం ఢీకొట్టడం వల్లే బైక్ పూర్తిగా నుజ్జునుజ్జు అయిందని పేర్కొన్నారు. విష్ణు రఘునాథన్‌ది కేరళ. జాతీయ కయాకింగ్ ఛాంపియన్. హాంకాంగ్‌లో జరిగిన 2024 ఆసియా కప్‌లో 1000 మీటర్ల కే-2 విభాగంలో బంగారు పతకం సాధించాడు.

Exit mobile version