Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య గురువారం జరిగిన మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ రంగాల్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు పూర్తిగా తేలిపోయింది. దీంతో ఈ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. భువనేశ్వర్ స్వింగ్ దెబ్బకు ఆప్ఘనిస్తాన్ బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తారు. అయితే ఈ మ్యాచ్‌లో మూడు క్యాచ్‌లు అనుమానాస్పదంగా ఉన్నాయని నెటిజన్‌లు ఆరోపిస్తున్నారు. టీమిండియా ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఇచ్చిన పలు తేలికైన క్యాచ్‌లను ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు విడిచిపెట్టడం కూడా అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడుతున్నారు.
Read Also: Abhishek benerjee: ఇండియాస్ బిగ్గెస్ట్ పప్పు.. అమిత్ షా
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రెచ్చిపోగా.. మరో ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ ఏకంగా సెంచరీ దాహం తీర్చుకున్నాడు. అయితే కోహ్లీ 28 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్‌ను ఆప్ఘనిస్తాన్ ప్లేయర్లు నేలపాలు చేశారు. మహమ్మద్ నబీ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా కోహ్లీ బంతిని తరలించగా.. బౌండరీ వద్ద ఉన్న ఇబ్రహీం జాడ్రన్ క్యాచ్ అందుకునేందుకు వీలుంది. అయితే అతడు ఆ క్యాచ్ వదిలేసిన విధానం చూస్తే కావాలని వదిలేసి ఉంటాడని అనుకోక ఉండరు. అతడు ఈ క్యాచ్ వదిలేయడంతో సిక్స్ వెళ్లిపోయింది. దీంతో నెటిజన్లు ఈ వీడియోను ఎక్కువగా ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే రిషబ్ పంత్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను ముజీబ్ ఉర్ రెహ్మన్ వదలడమే కాకుండా.. వాటిని బౌండరీలకు నెట్టేసినట్లు కన్పించింది. ముఖ్యంగా ఆఫ్ఘన్ ప్లేయర్ల ముఖాల్లో ఎలాంటి కసి కనిపించలేదని.. అందుకే ఈ మ్యాచ్ ఫిక్సయిందని నెటిజన్‌లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు చేసేవాళ్లంతా పాకిస్థాన్ అభిమానులేనని భారత అభిమానులు మండిపడుతున్నారు.
https://twitter.com/RanaAjm90575118/status/1567940476401078272
