Site icon NTV Telugu

Australia: ఆస్ట్రేలియాకు షాక్.. టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం..!!

Cricket Australia

Cricket Australia

Australia: త్వరలో మూడు టీ20ల సిరీస్‌ కోసం భారత్ రానున్న ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా ముగ్గురు కీలక ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టాయినీస్ జట్టుకు దూరమయ్యారు. ఇటీవల న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు గాయపడ్డారు. మిచెల్ స్టార్క్ మొకాలి గాయంతో బాధపడుతుండగా.. మిచెల్ మార్ష్ చీల మండ గాయంతో, మార్కస్ స్టాయినీస్ పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే టీ20 ప్రపంచకప్‌కు ముందు ముగ్గురు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఆందోళన పడుతోంది.

Read Also: Tamilnadu: వైరల్ వీడియో.. ఓ సారూ.. నువ్వు ఎంతటి రసికుడివో తెలిసెరా..!!

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. అందులోనూ ఈ ఏడాది ప్రపంచకప్ సొంతగడ్డపై జరుగుతుండటం ఆ జట్టుకు ప్లస్ పాయింట్ కానుంది. కానీ కీలక బౌలర్‌తో పాటు ఇద్దరు స్టార్ ఆల్‌రౌండర్లు గాయాలతో జట్టుకు దూరం కావడంతో ఆ జట్టులో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతానికి గాయాలు పెద్దవి కాకపోయినా మెగా టోర్నీకి ముందు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక టీమిండియాతో సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. గాయపడ్డ ఆటగాళ్ల స్థానాల్లో నాథన్ ఎల్లిస్, డానియల్ సామ్స్, సీన్ అబాట్‌లను ఎంపిక చేసింది. కాగా ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ భారత పర్యటనకు విశ్రాంతి తీసుకుంటానని చెప్పడంతో సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు.

Exit mobile version