T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో సమరానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ సేన రెండు విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. బుధవారం అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌కు వరుణుడి గండం పొంచి ఉంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం అడిలైడ్‌లో బుధవారం నాడు 90 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకవేళ వరుణుడి కారణంగా బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది. అలా జరిగితే భారత్ సెమీస్ అవకాశాలు ఇరకాటంలో పడతాయి. అప్పుడు ఆదివారం నాడు జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సి ఉంటుంది.
Read Also: హాట్ ఫోటోలతో కుర్రాళ్ల గుండెల్లో కాక రేపుతున్న బిగ్‌బాస్ బ్యూటీ
ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా భారత్ నేరుగా సెమీస్ చేరాలంటే బంగ్లాదేశ్, జింబాబ్వేలతో జరిగే రెండు మ్యాచ్‌లలో విజయం సాధించాలి. గ్రూప్-2 నుంచి దక్షిణాఫ్రికాకు సెమీస్ బెర్త్ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఖాతాలో 5 పాయింట్లు ఉన్నాయి. జింబాబ్వేతో మ్యాచ్ రద్దు కావడంతో ఒక పాయింట్, బంగ్లాదేశ్, టీమిండియా జట్లపై విజయం సాధించడంతో నాలుగు పాయింట్లు వచ్చాయి. మరోవైపు టీమిండియా ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లపై గెలిచిన భారత్ సఫారీలపై మాత్రం ఓడిపోయింది. దక్షిణాఫ్రికా టీమిండియా ఓడిపోవడంతో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. అదృష్టం కలిసి వస్తే తప్ప ఆ జట్టు సెమీస్‌కు వెళ్లే అవకాశం లేదనే చెప్పాలి.
