NTV Telugu Site icon

Danish Kaneria: టీమిండియాను చూసి నేర్చుకోండి..పాక్‌కు మాజీ క్రికెటర్ సలహా

Kan1

Kan1

ఈ ఏడాది చివర్లో వన్డే ప్రపంచకప్‌ జరగనుండటంతో ఈ ఫార్మాట్‌లో టీమిండియా వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడే విధంగా బీసీసీఐ షెడ్యూల్‌ని రూపొందించింది. అందుకు తగ్గట్టుగానే ఈ సంవత్సరంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ గెలిచి రోహిత్‌సేన శుభారంభం చేసింది. శ్రీలంకపై వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్.. కివీస్‌పై వన్డే సిరీస్‌నూ తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా తన నేషనల్ టీమ్‌కు కీలక సూచనలు చేశాడు. ప్రపంచ కప్‌ కోసం జట్టును తయారు చేసే విషయంలో భారత్‌ నుంచి నేర్చుకోవాలని సూచించాడు. ఈ ఏడాదిని పాకిస్థాన్‌ ఓటమితో ప్రారంభించింది. న్యూజిలాండ్‌తో 1-2 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది.

Pawan Kalyan varahi : రేపు కొండగట్టుకు వారాహి.. పూజల అనంతరం రోడ్డెక్కనున్న వాహనం 

దురదృష్టవశాత్తు రిషభ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడి వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. దీంతో అప్రమత్తమైన బీసీసీఐ వికెట్‌కీపర్‌గా కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా ఇషాన్‌ కిషన్‌ను సిద్ధం చేస్తున్నారని కనేరియా చెప్పాడు. పాక్‌ జట్టులో ఇలా జరగడం లేదన్నాడు. మహ్మద్‌ రిజ్వాన్‌కు బ్యాకప్‌గా మహ్మద్ హారిస్‌కు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నాడు. ప్రపంచ కప్ కోసం జట్టును నిర్మించడంలో అభిమానం సహాయం చేయదని కనేరియా విమర్శించాడు. ఇప్పటికైనా మేనేజ్‌మెంట్ మేల్కోవాలని సూచించాడు. లేకపోతే మెగాటోర్నీలో జట్టు ఆశించిన ఫలితాలు రాబట్టే అవకాశం లేదని చెప్పాడు. అలాగే మెగాటోర్నీకి ముందు ప్లేయర్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వాలని కోరాడు. లేకపోతే టీమిండియాలా మ్యాచ్ విన్నర్లు తయారయ్యే అవకాశం ఉండదని వెల్లడించాడు.