ICC WTC: ఆసీస్‌పై విజయంతో భారత్ స్థానానికి ఎసరు పెట్టిన శ్రీలంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాలే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక విజయం సాధించింది. ఏకంగా ఇన్నింగ్స్ 39 పరుగుల తేడాతో గెలిచి రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23లో శ్రీలంక జట్టు నాలుగో విజయాన్ని నమోదు చేసింది. డబ్ల్యూటీసీ సెకండ్ ఫేజ్‌లో ఆస్ట్రేలియాకు ఇదే తొలి ఓటమి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్థానానికి దెబ్బ పడటంతో పాటు టీమిండియా స్థానానికి కూడా శ్రీలంక ఎసరు తెచ్చింది. తాజా ఓటమితో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయింది. రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా 71.43 విన్నింగ్ పర్సంటేజీతో అగ్రస్థానానికి చేరుకుంది.
ఆస్ట్రేలియాపై గెలుపుతో శ్రీలంక ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు మూడో స్థానంలో ఉన్న టీమిండియా ఐదో స్థానానికి పడిపోయింది. పాకిస్థాన్ మాత్రం నాలుగో స్థానంలోనే కొనసాగుతోంది. ఆరో స్థానంలో వెస్టిండీస్, ఏడో స్థానంలో ఇంగ్లండ్, 8వ స్థానంలో న్యూజిలాండ్, 9వ స్థానంలో బంగ్లాదేశ్, 10వ స్థానంలో జింబాబ్వే కొనసాగుతున్నాయి. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23లో భాగంగా భారత్ ఇప్పటివరకు నాలుగు సిరీస్‌ల ద్వారా 12 టెస్టులు ఆడగా వాటిలో ఆరు మ్యాచ్‌లలో విజయం సాధించగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. భారత్ పరాజయాల్లో రెండు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండగా.. మరో రెండు ఇంగ్లండ్ పర్యటనలో చోటుచేసుకున్నాయి. మరో రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి.
Also Read
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..

తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!