Site icon NTV Telugu

IND Vs AUS: రెండో టీ20 8 ఓవర్లకు కుదింపు.. టాస్ గెలిచిన టీమిండియా

Toss 1

Toss 1

IND Vs AUS: నాగపూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. గురువారం కురిసిన వర్షానికి మైదానం చిత్తడిగా మారడంతో పిచ్‌ను డ్రై చేయడంలో ఆలస్యమైంది. దీంతో రెండు జట్ల కెప్టెన్లతో సంప్రదింపుల అనంతరం మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్‌ రాత్రి 9:30 గంటలకు ప్రారంభం అవుతుందని అంపైర్లు ప్రకటించారు. కేవలం 8 ఓవర్ల మ్యాచ్ కావడంతో ఇరు జట్లలో హిట్టర్లు చెలరేగే అవకాశం ఉంది. భారత్‌లో రోహిత్, కోహ్లీ, హార్దిక్, సూర్యకుమార్‌పై భారీ అంచనాలుండగా.. ఆసీస్‌లో గ్రీన్, ఫించ్, మాథ్యూ వేడ్, మ్యాక్స్‌వెల్ వంటి హిట్టర్లు ఎలా ఆడతారనేది ఆసక్తిగా మారింది.

కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులను చేసింది. ఉమేష్ యాదవ్ స్థానంలో బుమ్రా, భువనేశ్వర్ స్థానంలో రిషబ్ పంత్ జట్టులోకి వచ్చారు. కాగా ఫస్ట్ ఇన్నింగ్స్ 9:30 నుంచి 10:04 గంటల వరకు.. సెకండ్ ఇన్నింగ్స్ 10:14 నుంచి 10.48 వరకు జరగనుంది.

భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, బుమ్రా, చాహల్
ఆస్ట్రేలియా జట్టు: ఫించ్, గ్రీన్, స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, మథ్యూ వేడ్, కమ్మిన్స్, డానియల్ శామ్స్, ఆడం జంపా, హేజిల్‌వుడ్

Exit mobile version