NTV Telugu Site icon

U-19 World Cup: అండర్-19 మహిళల ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన భారత్

Team India U19 World Cup

Team India U19 World Cup

U-19 World Cup: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 మహిళల అండర్ 19 ప్రపంచకప్‌లో టీమిండియా దుమ్ము రేపుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి భారత మహిళల జట్టు 219 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో అండర్ 19 మహిళల ప్రపంచకప్‌లో 200 పరుగులు చేసిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. టీమిండియా బ్యాటర్లలో కెప్టెన్ షఫాలీ వర్మ 34 బంతుల్లో 78, శ్వేత 49 బంతుల్లో 74 పరుగులు, రిచా ఘోష్ 29 బంతుల్లో 49 పరుగులు చేశారు.

Read Also: House Wife Self Destruction: అత్తింటి వేధింపులు తాళలేక… వివాహిత బలవన్మరణం

అనంతరం 220 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 97 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ మహిళల జట్టు 122 పరుగుల భారీ తేడాతో విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో 34 బంతుల్లోనే 78 పరుగులు చేసిన షఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. బౌలింగ్‌లోనూ షఫాలీ వర్మ రాణించింది. రెండు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చింది. షబ్నామ్, సధు, కశ్యప్, చోప్రా తలో వికెట్ సాధించారు. కాగా తాజా విజయంతో గ్రూప్-డిలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.