Taniya Bhatia: లండన్ హోటల్లో చేదు అనుభవం.. రూమ్‌లోకి దూరి..
Team India Wicket Keeper Taniya Bhatia Bag Robbed In London Marriot Hotel: టీమిండియా వికెట్ కీపర్ తానియా భాటియాకు లండన్ హోటల్లో చేదు అనుభవం ఎదురైంది. గుర్తు తెలియని వ్యక్తులు తానియా ఉంటోన్న రూమ్‌లోకి దూరి.. ఆమె బ్యాగులో ఉన్న డబ్బులు, కార్డులు, వాచీలతో పాటు జ్యువెలరీని దొంగలించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్ మాధ్యమంగా తెలిపింది. అంతేకాదు.. హోటల్ మేనేజ్మెంట్పై, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘లండన్‌లోని మారియట్ మైదా వాలే హోటల్ మేనేజ్మెంట్ నన్ను షాక్‌తో పాటు నిరాశకు గురి చేసింది. నేను నా భారతీయ మహిళా జట్టుతో ఉన్నప్పుడు.. ఎవరో నా పర్సనల్ రూమ్‌లోకి దూరి, నా బ్యాగ్‌ను దొంగలించారు. అందులో డబ్బుతో పాటు కార్డులు, వాచీలు, జ్యువెలరీ ఉన్నాయి. ఈ హోటల్ మరీ అంత అసురిక్షితమా? దీనిపై వెంటనే విచారణ జరిపి, సమస్యని పరిష్కరిస్తానని నేను ఆశిస్తున్నాను. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, తమ దేశంలో పర్యటించే క్రికెటర్లకు ఇలాంటి భద్రత లేని హోటల్స్‌లో బస కల్పిస్తారని నేను అస్సలు ఊహించలేదు’’ అని తానియా ట్వీట్ చేసింది.
Also Read
- IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
- CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్‌లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
- Sanju Samson: గుజరాత్ టైటాన్స్‌పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
ఇందుకు హోటల్ యాజమాన్యం వెంటనే స్పందిస్తూ.. ఇలా జరిగినందుకు క్షమించాల్సిందిగా కోరింది. ఏ పేరుతో రిజర్వేషన్ చేసుకుందో, అందుకు సంబంధించిన వివరాల్ని తమకు మెయిల్ చేయాల్సిందిగా కోరింది. వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. కాగా.. ఇంగ్లండ్‌ని వారి గడ్డ మీద క్లీన్ స్వీప్ చేయడంతో, ఇంగ్లండ్ అభిమానులు కావాలనే పగతో ఈ పనికి పాల్పడి ఉంటారని భారత క్రీడాభిమానులు అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!