Site icon NTV Telugu

IND Vs HKG: హాఫ్ సెంచరీలతో చెలరేగిన కోహ్లీ, సూర్య.. హాంకాంగ్ ముందు భారీ టార్గెట్

Hongkong Match

Hongkong Match

IND Vs HKG: ఆసియా కప్‌లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ (21) నిరాశపరచగా.. ఫామ్‌తో తంటాలు పడుతున్న కేఎల్ రాహుల్ (36) నత్తనడకన బ్యాటింగ్ చేశాడు. దీంతో పసికూన హాంకాంగ్‌పై టీమిండియా ఎంత స్కోరు చేస్తుందనే విషయంపై అభిమానుల్లో ఉత్కంఠ రేపింది. అయితే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన విరాట్ కోహ్లీ (59 నాటౌట్) ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. కోహ్లీ 44 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 59 పరుగులు చేశాడు.

Read Also: Asia Cup 2022: భారత్, పాకిస్థాన్ జట్లకు షాక్.. మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత

అటు సూర్యకుమార్ యాదవ్ ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. 26 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో రెచ్చిపోయాడు. దీంతో 68 నాటౌట్‌గా నిలిచాడు. ఈ మేరకు టీమిండియా 192 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ముఖ్యంగా సూర్యకుమార్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌‌లో ఏకంగా 4 సిక్సర్లు బాది విధ్వంసం సృష్టించాడు. హాంకాంగ్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే 193 పరుగులు చేయాలి. టీమిండియా ఈ మ్యాచ్ గెలిస్తే సూపర్-4 చేరుకున్న రెండో జట్టుగా నిలుస్తుంది. ఇప్పటికే గ్రూప్-బి నుంచి ఆఫ్ఘనిస్తాన్ రెండు విజయాలు సాధించి టాప్-4కు దూసుకెళ్లింది.

Exit mobile version