కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ (19) విఫలమైనా… మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. కోహ్లీ (52), కీపర్ రిషబ్ పంత్ (52) రాణించారు. పంత్, వెంకటేష్ అయ్యర్ కలిసి 35 బంతుల్లో 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోస్టన్ ఛేజ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. వెస్టిండీస్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే 187 పరుగులు చేయాలి.
IND Vs WI: రెండో టీ20లో దుమ్మురేపిన భారత్.. విండీస్ టార్గెట్ 187 పరుగులు
