NTV Telugu Site icon

T20 World Cup: వార్మప్ మ్యాచ్‌లో రాహుల్, సూర్యకుమార్ హాఫ్ సెంచరీలు.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే..?

Team India

Team India

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా రాణించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 33 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. సూర్యకుమార్ కూడా 33 బంతులనే ఎదుర్కొన్నాడు. అతడు 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే రోహిత్(15), కోహ్లీ(19) ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేదు.

Read Also: IPL 2023: ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. అదృష్టవంతులు ఎవరో..?

అటు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా నిరాశపరిచాడు. పాండ్యా కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి రిచర్డ్ సన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. దినేష్ కార్తీక్ 20 పరుగులు చేశాడు. రిషబ్ పంత్‌కు బ్యాటింగ్ అవకాశం ఇవ్వలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో రిచర్డ్‌సన్ 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఆస్ట్రేలియా 187 పరుగులు చేయాలి. భారత బౌలర్లు ఇటీవల వరుసగా ఆసియా కప్, సొంతగడ్డపై ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లలో విఫలమైన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తారో వేచి చూడాలి.