IND Vs ZIM: టీ20 ప్రపంచకప్‌లో అడిలైడ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 51 పరుగులు చేశాడు. రోహిత్ (15) మరోసారి విఫలమయ్యాడు. విరాట్ కోహ్లీ 26 పరుగులు చేశాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌కు సూర్యకుమార్ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. సూపర్‌ఫామ్‌లో ఉన్న అతడు మరోసారి హాఫ్ సెంచరీతో జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు.
Read Also: Kantara : అందుకే వాళ్ల సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.. ‘కాంతార’ హీరో సెన్సేషనల్ కామెంట్స్
సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 6 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతేకాకుండా 2022లో అంతర్జాతీయ టీ20లలో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం టీ20 ర్యాంకుల్లో సూర్యకుమార్ నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో జింబాబ్వే గెలవాలంటే 187 పరుగులు చేయాలి. అయితే టీమిండియా ఈ మ్యాచ్ గెలిస్తే అడిలైడ్‌లో జరిగే రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఢీకొంటుంది. ఒకవేళ ఓడిపోతే సిడ్నీ వేదికగా జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉంటుంది. ఎవరితో సెమీస్ ఆడాలని ఉందో టీమిండియా ప్రదర్శనపైనే ఆధారపడి ఉంది.