IND Vs SL: ఆసియా కప్‌లో శ్రీలంకపై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాలో కెప్టెన్ రోహిత్ శర్మ(72), సూర్యకుమార్(34) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక ముందు 174 పరుగుల లక్ష్యం నిలిచింది. శ్రీలంక బౌలర్లు అద్భుతమైన యార్కర్లతో భారత బ్యాటర్లను ఔట్ చేశారు. లంక బౌలర్లలో మధుశంక 3, శనాక, కరుణరత్నే చెరో 2 వికెట్లు తీయగా.. తీక్షణ ఓ వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత బౌలర్లు అద్భుతం చేయాల్సిందే.
Read Also: బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. ఎవరెవరు ఎంత తీసుకున్నారంటే..?
కాగా ఈ మ్యాచ్‌లో అంపైర్ల తప్పుడు నిర్ణయం కారణంగా టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ బలయ్యాడు. బంతి బ్యాట్‌కు తాకినా థర్డ్ అంపైర్ ఎల్బీ అవుట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయిన రాహుల్.. మైదానంలోనే అంపైర్‌పై అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది.