Site icon NTV Telugu

IND Vs SA: రెండో టీ20లో చేతులెత్తేసిన బ్యాటర్లు.. బౌలర్ల మీదే ఆశలు

Dinesh Karthik

Dinesh Karthik

కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేయగలిగారు.ఇషాన్ కిషన్(34), శ్రేయాస్ అయ్యర్ (40) మినహా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు షాకుల మీదు షాకులు తగిలాయి. రుతురాజ్ గైక్వాడ్ (1), రిషబ్ పంత్ (5), హార్డిక్ పాండ్యా (9), అక్షర్ పటేల్(10) ఇలా వచ్చి అలా వెళ్లారు. టీమిండియా 140 పరుగులకు పైగా స్కోరు చేసిందంటే ఆ పుణ్యమంతా దినేష్ కార్తీక్‌దే.

చివరి ఓవర్లలో క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్ వేగంగా పరుగులు చేశాడు. 21 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 30 పరుగులు చేశాడు. హర్షల్ పటేల్ 9 బంతుల్లో రెండు ఫోర్ల సహాయంతో 12 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ 2 వికెట్లు తీయగా.. రబాడ, పార్నెల్, ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీశారు.

Exit mobile version